తనకిష్టమైన పవన్ ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ | Renu Desai shares Her Favorite Pawan Photo

Renu desai shares her favorite pawan photo

Renu Desai shares Pawan Photo, Renu Desai shares Pawan pic, Renu Desai wishes pawan with photo, Renu Desai shares Her Favorite Pawan Photo, Renu Desai shares pawan rare photo

Renu Desai shares Her Favorite Pawan Photo and wished him.

పవన్ లోని ఇంటెన్సిటీని బయటపెట్టిన రేణు

Posted: 08/29/2016 03:49 PM IST
Renu desai shares her favorite pawan photo

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు మరో మూడు రోజులు మాత్రమే ఉంది. కానీ, ఈ లోపే ఆన్ లైన్లో సెలబ్రేషన్స్ వేడుకలు స్టార్ట్ అయిపోయ్యాయి. ఇంతకీ వీటిని మొదలుపెట్టిందో ఎవరో తెలుసా? ఇంకెవరకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్. తన ట్విట్టర్ అకౌంట్లో తాను తీసిన ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ ఆనందం పంచుకుంటోంది.

వీరిద్దరు విడిపోయినా, అప్పుడప్పుడు కలుసుకుంటూనే వుంటారు. సందర్భాన్ని బట్టి రేణుదేశాయ్ పవన్ ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా పవన్ గురించి ఆసక్తికర విషయాలు, పిల్లలతో కలుసుకునే సందర్భాలు ఇలా అన్నీ చెబుతూనే ఉంటుంది. అలా ఈ ఇద్దరూ టచ్ లోనే ఉంటారన్న మాట.

ఇక సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఫోటో ఒకటి రేణుదేశాయ్ ట్విట్టర్ లో షేర్ చేసింది. 2010లో తీసిన ఈ ఫోటో తనకి ఎంతో ఇష్టమనీ .. ఇది పవన్ కళ్లలోని ఇంటెన్సిటీని బయటికి తెలుపుతూ ఉంటుందని అంది. స్కిన్ టోన్ సహజమైనదేననీ .. తానేమీ మార్చలేదని పేర్కొంది. రేణు దేశాయ్ కి ఇష్టమైనదిగా చెప్పడంతో, ఈ ఫోటోను చూసుకుని పవన్ అభిమానులు మురిసిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  twitter  share  Pawan Photo  

Other Articles