జనతా గ్యారేజ్ ఓవర్సీస్ బిజినెస్ ఎలా | Janatha Garage eyed on overseas records

Janatha garage eyed on overseas records

Janatha Garage eyed on overseas records, Janatha Garage overseas records, Janatha Garage records, Janatha Garage updates, Janatha Garage promotions, Janatha Garage interviews, Janatha Garage release, Janatha Garage theatrers, Janatha Garage over seas

Janatha Garage eyed on overseas records.

అక్కడి అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి

Posted: 08/29/2016 01:28 PM IST
Janatha garage eyed on overseas records

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కాంబినేషన్ పరంగా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. దీంతో రికార్డులు చెరిగిపోవటం గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు యూఎస్ లోను భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
గ్యారేజ్ సందడి మొదలుపెట్టారు

దీనికి ప్రత్యేక కారణం ఉంది. గతంలో ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా అక్కడ 1మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది. 'నాన్నకు ప్రేమతో' సినిమా 2 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' 3 మిలియన్ డాలర్లను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాను ఈ సినిమా అవలీలగా అందుకుంటుందనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

గ్యారేజ్ రికార్డుల మోత షురూ

ఇక్కడ బిజినెస్ కాస్త నష్టాలనే రుచి చూపించినప్పటికీ నాన్నకు ప్రేమతో సినిమా మేజర్ పార్ట్ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకోవటంతో ఓవర్సీస్ లో బిజినెస్ తోనే సినిమా గట్టెక్కగలిగింది. కానీ, ఇప్పుడు గ్యారేజ్ ఆ రికార్డును చెరిపివేసే ఛాన్స్ ఉంటుందా అన్న ప్రశ్నలు మరోవైపు రేపుతున్నాయి. అయితే కొరటాల శివ గతంలో తీసిన శ్రీమంతుడు బాహుబలి తర్వాత ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో అల్రెడీ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తుండటంతో జనతా గ్యారేజ్ ఖచ్ఛితంగా దుమ్ము దులపటం ఖాయమని చిత్ర నిర్మాతలు ధీమాతో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  overseas records  

Other Articles