గ్యారేజ్ రికార్డులు అల్రెడీ మొదలయిపోయాయి | NTR Janatha Garage trailer crosses 3 million Views

Janatha garage trailer crosses 3m views

Janatha Garage trailer, Janatha Garage trailer new record, 3 million Views for Janatha Garage Trailer, NTR Janatha Garage Trailer

జనతా గ్యారేజ్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ | Janatha Garage trailer crosses 3 million Views

గ్యారేజ్ రికార్డుల మోత షురూ

Posted: 08/17/2016 09:53 AM IST
Janatha garage trailer crosses 3m views

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ కు ముందే సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకు జ్యూక్ బాక్స్ లో లక్ష దాకా హిట్లు రాగా, ఇంకోవైపు ట్రైలర్ యూట్యూబ్ లో ప్రభంజంనం సృష్టిస్తోంది. ఆగష్టు 12న విడుదలైన ట్రైలర్ కేవలం రెండే రోజుల్లో 2 మిలియన్ వ్యూవ్స్ సాధించగా, ఇప్పటిదాకా 3.1 మిలియన్ రావటం విశేషం. ఇక యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కు  48,000 లైకులు వచ్చాయి.

ఇప్పటికే టీజర్ తో మోస్ట్ వైరల్ గా ఇండియా వైడ్ గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు థియట్రికల్ ట్రైలర్ తోనూ అదే జోరు చూపిస్తోంది. సినిమా కంటెంట్ ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్ మరిన్ని రికార్డుల కోసం దూసుకుపోతోంది.

చూస్తుంటే జనతా గ్యారేజ్ హవా మరింత భారీగా కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది.అంతేకాకుండా కచ్చితంగా కొరటాల గత చిత్రాలవలె బ్లాక్ బస్టర్ లిస్ట్‌లో చేరిపోతుందని చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఆనందపడుతున్నారు. ఇలా కేవలం ప్రమోషన్ వీడియోలతోనే రికార్డులు చెరిపేస్తున్న జూనియర్ అన్ని సజావుగా సాగితే సెప్టెంబర్ 2 టాలీవుడ్ లో మరిన్ని రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం.  

మేకింగ్ వీడియో :

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Koratala Shiva  Janatha Garaje  Trailer  

Other Articles