బాలీవుడ్ కు వెళ్లనున్న బిచ్చగాడు | Bichagadu remake in Bollywood

Bichagadu remake in bollywood

Bichagadu in Bollywood, Bollywood Bichagadu, Bichagadu bollywood remake, Bichagadu Hindi, Pichaikkaran bollywood

Fox Star Studios, one of the leading film companies in India, is planning to remake Bichagadu( Pichaikkaran) in Hindi.

బాలీవుడ్ బిచ్చగాడు ఎవరంటే...

Posted: 08/18/2016 03:43 PM IST
Bichagadu remake in bollywood

ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన బిచ్చగాడు టాలీవుడ్ ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. తమిళంలో పిచ్చైకారన్ గా విజయ్ ఆంటోనీ నిర్మించి, నటించిన ఈ చిత్రం అక్కడ యావరేజ్ గా ఆడిన, తెలుగులో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. స్టార్లు లేకపోయినా కథలో కంటెంట్ ఉంటే చాలని నిరూపించింది.

తొలుత తెలుగులోనూ రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికీ అది కుదరక డైరక్ట్ గా డబ్ చేసి రిలీజ్ చేశాడు విజయ్ ఆంటోనీ. వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డుతోపాటు వంద రోజులకి చేరువైంది. ఈ నేపథ్యంలో ఈ వండర్ మూవీపై బాలీవుడ్ కన్ను పడింది. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు బిచ్చగాడి కోసం క్యూ కడుతున్నారంట. ఫైనల్ గా రీమేక్ హక్కులను ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

యాక్షన్ కిలాడీ అక్షయ్ కుమార్ తో తీయాలని అనుకున్నప్పటికీ, ఈ చిత్రంతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో విజయ్ ఆంటోని వున్నాడట. ఇక హిందీలోను ఈ సినిమాకి 'శశి' దర్శకత్వం వహించనున్నాడనీ, వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లవచ్చని అనుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోతోనే తీసేందుకు ఫాక్స్ స్టార్ ఫ్లాన్ చేస్తోంది. అదే గనుక జరిగితే బాలీవుడ్ బిచ్చగాడు మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pichaikkaran  Bichagadu  bollywood  remake  

Other Articles