బిగ్ బాలీవుడ్ డెబ్యూకి రెజీనా రెడీ| Regina to make her Bollywood debut with Amithabh Aankhen sequel

Regina to make her bollywood debut with amithabh aankhen sequel

Regina to make her Bollywood debut, regina cassandra Aankhen 2, Regina Cassandra’s Aankhen 2 launch, Regina wardrobe malfunction at Aankhen 2 event, regina with Amithabh bachchan

regina cassandra to make her Bollywood debut with Amithabh Aankhen sequel

అమితాబ్ సినిమాలో రెజీనా ఎలా?

Posted: 08/18/2016 01:23 PM IST
Regina to make her bollywood debut with amithabh aankhen sequel

పెద్ద హీరోతో సినిమా చేసిన హిస్టరీ లేదు, ఈ మధ్య ఒక్క సినిమా హిట్ లేదు. అయినా చేతిలో అరడజను ప్రాజెక్టులతో వరుసగా బిజీగా గడిపేస్తుంది డస్కీ బ్యూటీ రెజీనా. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా ఓ బాలీవుడ్ ప్రాజెక్టు, అది కూడా అమితాబ్ సినిమాలో రెజీనాకు అవకాశం వస్తుందని ఎవరైనా ఊహిస్తారా?

అమితాబ్, అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్, పరేష్ రావెల్, సుస్మితాసేన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆంఖేన్(2002) హిట్ గా నిలిచింది. ఆ చిత్రం సీక్వెల్ ను ఇప్పుడు ఫ్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అర్జున్ రాంపాల్ మరియు అర్సద్ వార్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతుంది. ఇందులో గోవా బ్యూటీ ఇలియానాను ఇప్పటికే ఒక హీరోయిన్ గా సెలక్ట్ చేయగా, ఇప్పుడు రెజీనా ను మరో హీరోయిన్ గా ఎంపిక చేశారంట. ఈ విషయాన్ని స్వయంగా ఈ బ్యూటీయే చెప్పుకుంటుంది.

ఆ చిత్ర యూనిట్ నుంచి నా పీఆర్వోకి ఫోన్ వచ్చింది. బాలీవుడ్ ఛాన్స్ అది కూడా బిగ్ మల్టీస్టారర్ అనగానే ఎగిరి గంతేశా... ఇందులో నెగటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నా. కానీ, షూటింగ్ జనవరిలో మొదలుకానుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఫర్వాలేదు. ఆలోపు హిందీ మొత్తం నేర్చేసుకుని సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటా అంటూ తెగ సంబరపడిపోతుంది రెజీనా. కానీ, సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి క్లిక్ అయిన హీరోయిన్లు లేరన్న విషయం ఈ అమ్మడు మరిచిపోతుందేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina cassandra  Aankhen 2  Amithabh Bachchan  Bollywood Debut  

Other Articles