సునీల్ సాలిడ్ సక్సెస్ కొట్టాల్సిందే | Sunil Eedu Gold Ehe teaser

Sunil eedu gold ehe teaser

Sunil Eedu Gold Ehe movie teaser, Sunil Eedu Gold Ehe, Eedu Gold Ehe actress, Eedu Gold Ehe telugu movie

Sunil Eedu Gold Ehe movie teaser release.

సునీల్ సాలిడ్ సక్సెస్ కొట్టాల్సిందే

Posted: 08/13/2016 12:56 PM IST
Sunil eedu gold ehe teaser

సక్సెస్ రేటు సన్నగిల్లుతున్న సమయంలో వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు సునీల్. ఈ మధ్యే జక్కన్నగా వచ్చి జస్ట్ పాస్ మార్కులు వేయించుకున్న సునీల్ ఇప్పుడు గ్యాప్ ఇవ్వకుండా మరో సినిమాతో రాబోతున్నాడు.

బిందాస్, రగడ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల డైరక్షన్ లో ఈడు గోల్డ్ ఎహె అనే సినిమాతో సెప్టెంబర్ లో మనముందుకు రాబోతున్నాడు. రెడీ ఫర్ లాప్స్ అంటూ నిన్న సాయంత్రమే ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. లుక్ తో పాటు సబ్జెక్టు కూడా కాస్త కొత్తగానే ట్రై చేసినట్లు ఉన్నాడు సునీల్. దాదాపు స్టార్ కమెడియన్లతో ఇందులో ఉండటంతోపాటు, కథలో కూడా ఏదో ట్విస్ట్ ఉందంటూ చివర్లో హింట్ కూడా ఇచ్చాడు.

సుష్మారాజ్, రిచా పనై హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జయసుధ, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, బాబ్ అంథోని, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్, షకలక శంకర్ మొదలైనవారు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు సాగర్ మహతి మ్యూజిక్ సమరూర్చాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ మూడోవారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా అయిన సునీల్ హిట్ దాహం తీరాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Eedu Gold Ehe  teaser  

Other Articles