Ram meets his die hard fan poornachandrika in vizag

Ram meets his die hard fan poornachandrika in vizag

Ram meets his die hard fan, ram meets patient, Ram meets Poornachandrika, Ram meets Vizag Fan, Hero Ram with Poornachandrika family

Actor Ram meets his die hard fan poornachandrika in vizag.

హీరో రామ్ ఆ చిన్నారి కల నెరవేర్చాడు

Posted: 08/13/2016 11:12 AM IST
Ram meets his die hard fan poornachandrika in vizag

ఓవైపు చావు దగ్గరవుతుంటే తమ అభిమాన సెలబ్రిటీలను చూస్తూ కళ్లలో వెలుగులు నింపుకునే చిన్నారుల ఉదంతాలు పెరిగిపోతున్నాయి. వారి ప్రేమకు దాసోహమై చివరి క్షణాల్లో వారిని అప్యాయంగా పలకరించి, నాలుగు ఓదార్పు మాటలు అందించడానికి తారలు కూడా స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరిపోయాడు యువ నటుడు రామ్.  

విశాఖకు చెందిన ఐదేళ్ల బాలిక పూర్ణచంద్రిక గుర్తుతెలియని ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. తన అభిమాని అని తెలియగానే హుటాహుటినా ఆమె ఇంటికి వెళ్లిన రామ్ ఆ చిన్నారి పరిస్థితి చూసి కంటతడి కూడా పెట్టుకున్నాడు. ఎంవీపీ కాలనీకి చెందిన రవికుమార్ రెండో కుమార్తె పూర్ణచంద్రిక పుట్టిన నాటి నుంచి కాళ్లు కదపలేకపోతోంది. అంతుపట్టని వ్యాధితో సతమతమవుతున్న ఆ బాలిక ఇంకెంతో కాలం బతకదని వైద్యులు తేల్చేశారు. పూర్ణ రామ్ కి వీరాభిమాని. ప్రస్తుతం రామ్ హైపర్ సినిమా కోసం వైజాగ్ లోనే ఉన్నాడు. తమ కూతురి అభిమాన నటుడు తమ ఊళ్లోనే ఉన్నాడని తెలుసుకున్న పూర్ణ తల్లిదండ్రులు ఎలాగైనా రామ్ తో  పూర్ణను కలిపించే ప్రయత్నం చేశారు.

ఈ విషయమై శుక్రవారం చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్రయించగా, వారు రామ్ కి విషయం తెలియజేశారు. అంతే అప్పటికప్పుడే పూర్ణ దగ్గరికి వెళ్లిన రామ్ కదలలేని స్థితిలో ఉన్న బాలికను ఎత్తుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పాడు. అంతేనా తనతో శనివారం లంచ్ కి వారిని ఆహ్వానించాడు. తన కల నెరవేరిన వేళ బతుకు పోరాటం గురించి మరిచిపోయి సంతోషంలో మునిగిపోయిన తమ బిడ్డను చూస్తూ ఆ తల్లిదండ్రులు ఆనందభాష్పాలు కార్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero Ram  Meet  Die hard fan  Poornachandrika  

Other Articles