అనుష్క పక్కన స్టూల్ తో మ్యానేజ్ చేసిందట | nithya menon use stool while shoot with Anushka in Rudramadevi

Nithya menon use stool while shoot with anushka in rudramadevi

Nithya menon stool experience with Anushka, nithya menon praise Anushka, Nithya Menon about her hight, nithya Menon

Nithya Menon use stool while shoot with Anushka in Rudramadevi

స్వీటి కోసం స్టూల్ వాడిన నిత్యామీనన్

Posted: 08/01/2016 04:12 PM IST
Nithya menon use stool while shoot with anushka in rudramadevi

మల్లూ బ్యూటీ నిత్యామీనన్ టాలెంట్ కు ఒక్క టాలీవుడ్ ఏంటీ మొత్తం సౌత్ ఇండస్ట్రీనే దాసోహం అయిపోయింది. పాత్రాప్రాధాన్యం ఉన్న సిినిమాలనే ఎంచుకోవటం, వీరలెవల్లో యాక్ట్ చేయటం ఈ రింగు ఒత్తుల సుందరికి బాగా అలవాటు అయిపోయింది. అయితే అన్ని ఉన్నా నిత్యాకి ఒక్క లోటు మాత్రం పాపం బాగా కష్టపెడుతుందట.

అందమైన అమ్మాయే అయినప్పటికీ, కాస్త హైట్ తక్కువ కావటంతో చాలా సార్లు చిక్కులు పడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది. ముఖ్యంగా ఎత్తుగా ఉన్న హీరోలతో నటించేప్పుడు క్లోజప్ సన్నివేశాల్లో చాలా ఇబ్బందులే ఎదుర్కొందట. అయితే అనుష్కతో రుద్రమదేవీ చిత్రంలో చేసేప్పుడు మాత్రం ఆ కష్టం అస్సలు తెలీట్లేదంట. "స్వీటీ(అనుష్క) నా కంటే బాగా పొడుగు కదా... అందుకే ఆమెతో కాంబినేషన్ సీన్లు వచ్చినప్పుడు ఆమె పక్కన స్టూలు వేసుకుని, దానిపై నిలబడి నటించేదానిని. అలా ఆమె పక్కన నా హైట్ మేనేజ్ చేసేదానిని అంటూ చెబుతోంది.

అంటే 'గుండెజారి గల్లంతయ్యిందే' క్లైమాక్స్ లో హీరో నితిన్ సరదాగా ఆటపట్టిస్తాడే అలా అన్నమాట. ఏది ఏమైనా, అనుష్కతో కలసి నటించడం మాత్రం ఓ గొప్ప అనుభూతి. హీరోయిన్ పాత్రలపై తనదైన ముద్రవేసింది" అంటూ పొగడ్తలతో ముంచెత్తింది నిత్యామీనన్. పోనీ లెండి హైట్ గురించి ప్రస్తావిస్తే మిగతా అమ్మాయిల్లా చిర్రుబుర్రలాడకుండా నవ్వుతూ బదులిచ్చే నిత్య లాంటి వారు ఎంతమంది ఉంటారు చెప్పండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithya menon  Anushka  rudrama devi  stool  

Other Articles