అభినేత్రి టీజర్ లో తమన్నా స్టెప్పులు | Tamanna shaking floor steps in abhinetri teaser

Tamanna shaking floor steps in abhinetri teaser

Tamanna Abhinetri teaser, Tamanna dance in Abhinetri, Abhinetri official teaser, Abhinetri official, tamanna look in abhinetri, tamanna and prabhudeva in abhinetri

Tamanna shaking floor steps in abhinetri teaser.

తమన్నా ఇలా రెచ్చిపోయిందేంటీ?

Posted: 08/02/2016 09:27 AM IST
Tamanna shaking floor steps in abhinetri teaser

టాలీవుడ్ డాన్సులో ఇరగదీసే హీరోలు ఎందరు ఉన్నా... హీరోయిన్లలో మాత్రం ఆ లోటు కొట్టోచ్చినట్లు కనిపించకమానదు. అనుష్క, కాజల్, సమంత వీరంతా కేవలం నటనకు, గ్లామర్ కు మాత్రమే పరిమితం కాగా, డాన్సుల్లో ఎప్పుడూ ముందుండేది ఒక తమన్నానే.

తెలుగు చిత్రాలకు డాన్సింగ్ ఓనమాలు దిద్దించిన మెగాస్టార్ చిరంజీవి కూడా తమన్నా తనతో డ్యాన్సు చేస్తే బావుంటుందని చెప్పటం వెనక ఆమెలో ఎంత స్టఫ్ ఉందో ఈజీగా అర్థమైపోతుంటుంది. బన్నీ, ఎన్టీఆర్, చెర్రీ లాంటి డాన్సింగ్ స్టార్ల పక్కన్న వారితో సమానంగా స్టెప్పులు వేసిన మిల్కీ బ్యూటీ సొంతం. ముఖ్యంగా బద్రినాథ్ లో టైటిల్ సాంగ్ కు వేసిన స్పీడు స్టెప్పులు మామూలుగా ఉండవు. కిక్ యాస్ స్టెప్స్ లతో పిచ్చెక్కించే తమ్మూ ఇప్పుడు అభినేత్రి టీజర్ లోనూ రెచ్చిపోయింది.

తమన్నా ద్విపాత్రాభినయం చేస్తున్న అభినేత్రి సినిమా కోసం ఒక సోలో పెర్ఫామెన్స్ కూడా ఇచ్చింది. హాట్ డ్రెస్ లో నాజూకుగా మూవ్మెంట్లే కాదు... ఏకంగా హార్డు కోర్ ఫ్లోర్ మూవ్ మెంట్లను కూడా దంచిన పిండిలా కొట్టేసింది. ఇది చూస్తే మన హీరోలకు ఏ మాత్రం తీసిపోనని చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఈ స్టెప్పులు చేయించింది ఎవరో కాదు.. ఇండియన్ మైకేల్ జాక్సన్, ఈ చిత్ర హీరో ప్రభుదేవా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  abhinetri  teaser  prabhudeva  AL Vijay  

Other Articles