బాలయ్య కోసం అంత వదులుకుందా? | Shriya Saran Shocking Remuneration

Shriya saran shocking remuneration

Shriya Saran Shocking Remuneration, Shriya Saran Remuneration, Gautamiputra Satakarni Poster, Gautamiputra Satakarni shooting updates, Gautamiputra Satakarni movie news, Balakrishna with Shriya saran, Shriya in Gautamiputra Satakarni, Shriya saran latest stills, Shriya Saran hot stills, Shriya Saran photoshoot

Shriya Saran Shocking Remuneration: Shriya Saran confirmed as a heroine for Nandamuri Balakrishna Gautamiputra Satakarni film. directed by krish jagarlamudi and produced by Saibabu Jagarlamudi and Y. Rajeev Reddy under First First Frame Entertainment banner. Music composed by Devi Sri Prasad.

బాలయ్య కోసం అంత వదులుకుందా?

Posted: 06/11/2016 12:17 PM IST
Shriya saran shocking remuneration

నందమూరి బాలకృష్ణ 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రియ హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్స్ శ్రియ పాల్గొననుంది.

ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలందరితో జతకట్టిన ఈ అమ్మడికి ప్రస్తుతం అవకాశాలు లేకుండా పోయాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే రజనీకాంత్, విక్రమ్, విజయ్, ధనుష్, అజయ్ దేవగణ్ వంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు ఈ అమ్మడి డేట్స్ దొరకడమే చాలా కష్టంగా వుండేది. కానీ ఇపుడు మాత్రం యువ, స్టార్ హీరోయిన్ల పోటీ ఎక్కువవ్వడంతో శ్రియకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి.

తాజాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఈ అమ్మడి ఆఫర్ రావడంతో తన రెమ్యునరేషన్ ను సైతం తగ్గించుకున్నట్లుగా తెలిసింది. ఒకప్పడు 80 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే శ్రియ.. తాజాగా బాలయ్య సినిమా కోసం కేవలం 40 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. రెమ్యునరేషన్ విషయంలో తగ్గినప్పటికీ.. ఈ సినిమాపై శ్రియ చాలా ఆశలు పెట్టుకుందట. చారిత్రాత్మక కథతో రూపొందుతున్న ఈ సినిమాలో తనకు మంచి రోల్ లభించిందని.. ఈ సినిమా తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ధీమాతో వుందని సమాచారం.

పైగా ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు భావిస్తుండటంతో శ్రియ కూడా ఫుల్ హ్యాపీగా వుందట. ప్రస్తుతం బాలయ్య అమెరికాలో వున్నారు. అమెరికా నుంచి తిరిగి ఇండియాకు రాగానే కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఇందులో బాలయ్యతో పాటు శ్రియ కూడా షూటింగ్ లో పాల్గొననుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  Gautamiputra Satakarni  Shriya Saran  Krish  

Other Articles