డాక్టర్ తో బాలయ్య దర్శకుడి పెళ్లి! | Director Krish marriage with Ramya

Director krish marriage with ramya

Director Krish marriage with Ramya, Krish marriage with Ramya, Director Krish with Ramya, Director Krish to tie the knot, Director Krish movies, Gautamiputra Satakarni, Balakrishna

Director Krish marriage with Ramya: Tollywood National award winner director Krish ready for marriage with V Ramya.

డాక్టర్ తో బాలయ్య దర్శకుడి పెళ్లి!

Posted: 06/11/2016 10:49 AM IST
Director krish marriage with ramya

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విభిన్న సినిమాలను రూపొందించి ఇటీవలే ‘కంచె’ సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గతంలో క్రిష్ హీరోయిన్ అనుష్కతో ప్రేమలో వున్నాడని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.

ఆ తర్వాత క్రిష్ గురించి మళ్లీ ఇలాంటి పెళ్లి, ప్రేమలపై రూమర్లు రాలేవు. కానీ ఈసారి ఏకంగా పెళ్లికే సిద్ధమైపోయాడు. తాజాగా ప్రముఖ వార్త పత్రిక డిసి ఈ విషయాన్ని ప్రచురించింది. గతకొద్ది రోజులుగా క్రిష్ ను పెళ్లి చేసుకోమంటూ క్రిష్ తల్లి ఒత్తిడి చేస్తోందట. అందుకే ఇక చేసేది లేక పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

క్రిష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రమ్య. ఆమె సిటీలో ఓ డాక్టర్. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాకే పెద్దలు కుదర్చడం వలన పెళ్లికి అంగీకరించినట్లుగా తెలిసింది. వీరి పెళ్లి ఆగష్టులో జరుగనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ముహూర్తాలేమి లేవు కాబట్టి.. ఆగష్టు వరకు వేచి వుండాల్సిందే. మరికొద్ది రోజుల్లోనే తన పెళ్లి తేదిని క్రిష్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Krish  Balakrishna  Gautamiputra Satakarni  

Other Articles