హాలీవుడ్ స్థాయిలో ప్రభుదేవా రామాయణం | Prabhudeva talks about his dream project

Prabhudeva talks about his dream project

Prabhudeva talks about his dream project, Prabhudeva dream project Ramayanam, Prabhudeva Ramayanam Project, Prabhudeva movies, Prabhudeva teaser, Prabhudeva stills, Prabhudeva movie updates, Prabhudeva, Tamanna, Abhinetri

Prabhudeva upcoming film Abhinetri. Tamanna heroine. Sonusood, Amy Jackson acts in important roles. Prabhudeva talks about his dream project Ramayanam.

హాలీవుడ్ స్థాయిలో ప్రభుదేవా రామాయణం

Posted: 06/08/2016 05:30 PM IST
Prabhudeva talks about his dream project

చాలాకాలం తర్వాత మళ్లీ ‘అభినేత్రి’తో ప్రేక్షకుల సౌత్ ఇండియన్ ప్రేక్షకుల ముందుకొచ్చిన డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ప్రభుదేవా. ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘అభినేత్రి’ ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఇందులో ప్రభుదేవా స్టైలిష్ డాన్స్, సాజిద్-వాజిద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు లవ్, మాస్, కమర్షియల్ సినిమాలను తీసిన ప్రభుదేవాకు ఎప్పటికైనా ‘రామాయణం’ను సినిమాగా తీయాలని ఆశపడుతున్నాడు. అది కూడా ఓ హాలీవుడ్ సినిమా స్థాయిలో. ఈ విషయం గురించి ప్రభుదేవా చెబుతూ.. రామాయణం తన డ్రీం ప్రాజెక్ట్ అని, రామాయణాన్ని హాలీవుడ్ స్థాయిలో ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ తరహాలో రూపొందించాలన్నది తన కల అని చెప్పుకొచ్చాడు. కానీ ఆ కల ఎప్పుడు నెరవేరుతుందోనని ఆశతో ఎదురుచూస్తున్నాడట.

మరి రామాయణం వంటి క్లాసిక్ హిస్టరీని హాలీవుడ్ రేంజులో తీయాలంటే ఎంత అనుభవం వుండాలి. అలాంటి అనుభవం, తీయగల సత్తా ప్రభుదేవాకు వుందో లేదో? ఇప్పటికే ‘మహాభారతం’ను సినిమాగా తీయాలనేది తన డ్రీం అంటూ రాజమౌళి, దాసరి నారాయణ రావులు ప్రకటించారు. ఇపుడు ప్రభుదేవా ‘రామాయణం’పై కన్నేసాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరి కల నెరవేరనుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhudeva  Ramayanam  Abhinetri  Tamanna  

Other Articles