గౌతమీపుత్ర శాతకర్ణీతో శ్రియ జోడి! | Shriya confirmed in Gautamiputra Satakarni

Shriya confirmed in gautamiputra satakarni

Shriya confirmed in Gautamiputra Satakarni, Shriya Saran in Gautamiputra Satakarni, Shriya Saran movies, Gautamiputra Satakarni Movie First Look, Gautamiputra Satakarni Shooting updates, బాలకృష్ణ, శ్రియ, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Shriya Saran latest stills, Shriya Saran hot stills, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Shriya confirmed in Gautamiputra Satakarni: Nandamuri Balakrishna's upcoming movie Gautami Putra Satakarni directed by krish jagarlamudi and produced by Saibabu Jagarlamudi & Y. Rajeev Reddy. under First First Frame Entertainment banner. music composed by Devi Sri Prasad.

గౌతమీపుత్ర శాతకర్ణీతో శ్రియ జోడి!

Posted: 06/08/2016 04:27 PM IST
Shriya confirmed in gautamiputra satakarni

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్పణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమే బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించబోయే హీరోయిన్ కోసం గతకొద్ది రోజులుగా వార్తలొస్తూనే వున్నాయి. చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ వారెవరూ కాదని తేలిపోయింది. కానీ చివరకు ఓ స్టార్ హీరోయిన్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. తెలుగు, తమిళంలో హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న బ్యూటీ శ్రియను బాలయ్య సరసన హీరోయిన్ గా ఖరారు చేసినట్లుగా తెలిసింది.

శ్రియ అయితేనే ఇలాంటి చారిత్రాత్మక సినిమాలో సెట్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా భావిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో బాలయ్య-శ్రియ కలిసి ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో జోడికట్టారు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఈ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’లో జోడికట్టనున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే బాలయ్య తన లుక్ ను టోటల్ గా మార్చేసారు. బాలయ్య పుట్టినరోజున (జూన్10) ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి ర‌చ‌నా స‌హ‌కారం - భూప‌తిరాజా; మాట‌లు - సాయిమాధ‌వ్ బుర్రా; పాట‌లు - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి; ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ - భూపేష్ ఆర్.భూప‌తి; స్టిల్స్ - జీవ‌న్ రెడ్డి; డి.ఓ.పి - జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్; ఫైట్స్ - రామ్,ల‌క్ష్మణ్; డాన్స్ - బృంద‌; ఎడిటింగ్ - సూర‌జ్; సంగీతం - దేవిశ్రీప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - కొమ్మినేని వెంక‌టేశ్వర‌రావు; నిర్మాత‌లు - వై రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు; ర‌చ‌న - ద‌ర్శక‌త్వం - జాగ‌ర్లమూడి రాధాకృష్ణ (క్రిష్).

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriya Saran  Balakrishna  Gautamiputra Satakarni  

Other Articles