అఖండ భారతావనని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం తెరకెక్కనుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న బాలయ్య 100వ చిత్రానికి ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ అని టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా బిబో శ్రీనివాస్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ సినిమా నిర్మిస్తున్నారు.
నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉదయం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గార్లతో పాటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా మిత్రులందరికి బాలయ్య మరియు దర్శకుడు క్రిష్ కలిసి ఆహ్వానించారు.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాను ఏ రేంజులో తీర్చిదిద్దబోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు బాలయ్య గుర్రాలు, జీపులు, బైకులను వాడితే.. ఈ సినిమాలో సింహాంపై స్వారీ చేయబోతున్నట్లుగా కనిపిస్తోంది. ఎక్కడ తగ్గకుండా సినిమా ప్రారంభం నుంచి బాగా హైప్ పెంచేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను కూడా చాలా పద్ధతిగా, విభిన్నంగా రూపొందించారు.
చారిత్రక కథాంశంతో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని విజువల్స్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు క్రిష్ సన్నాహాలు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి జరుపుకోనుంది. మరికొద్ది గంటల్లో అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more