స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దక్షిణాది చిత్ర సీమలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆయన అభిమానుల్ని ప్రత్యక్షంగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా భారీ ఖర్చుతో గ్రాండియర్ గా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన సరైనోడు చిత్రం ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా బెంగళూరులో జరిగిన సరైనోడు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కన్నడ భాషలో మాట్లాడడంతో... అభిమానులు విజిల్స్, కేరింతలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. కిక్కిరిసిన అభిమానుల సమక్షంలో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.
‘సరైనోడు’ రేటింగ్ చెప్పి టెన్షన్ లో పెట్టేసాడు
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.... నాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో తెలుగు తర్వాత కర్ణాటకలో ఉన్న అభిమానులు ప్రత్యేకం. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతీ ఒక్క మెగాభిమానికి, ప్రేక్షకులకు ఏంతో రుణపడి ఉంటాను. నా చిత్రాలు ఇక్కడ ఆడుతున్న విధానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కన్నడ చిత్రాల్ని నేను ఎంతో గౌరవిస్తాను. గత మూడు సంవత్సరాలుగా కన్నడ చిత్రాల్లో ఎంతో పురోగతి కనిపిస్తోంది. చాలా మంచి చిత్రాలొస్తున్నాయి. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను అని అన్నారు.
అలాగే... నాకు రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. త్వరలోనే తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రం చేయబోతున్నాను. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా లక్ష్యం. సరైనోడు పూర్తి స్థాయి మాస్ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటరై టనర్. డైరెక్టర్ బోయపాటి అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. నా కోసం ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు. అభిమానులతో పాటు... ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more