‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై చిరు కామెంట్లు | Chiranjeevi speech in Gautamiputra Satakarni Film Launch

Chiranjeevi speech in gautamiputra satakarni film launch

Chiranjeevi speech in Gautamiputra Satakarni, Gautamiputra Satakarni Movie First Look, Gautamiputra Satakarni Shooting updates, బాలకృష్ణ, కేసిఆర్, క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణీ, Gautamiputra Satakarni shooting details, Gautamiputra Satakarni title logo, తెలంగాణ ముఖ్యమంత్రి, సినిమాలు, వార్తలు, రాజకీయాలు, Balakrishna movie updates, Balakrishna latest stills, Balakrishna stills, Balakrishna upcoming films, Balakrishna

Chiranjeevi speech in Gautamiputra Satakarni Film Launch: Nandamuri Balakrishna 100th film Gautamiputra Satakarni launched today. Krish director. Devisriprasad music.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’పై చిరు కామెంట్లు

Posted: 04/22/2016 11:04 AM IST
Chiranjeevi speech in gautamiputra satakarni film launch

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ అతిరథ మహారధులు విచ్చేసారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కె.రాఘవేంద్రరావు మరియు సింగీతం శ్రీనివాస్ రావు గారు చిత్ర యూనిట్ కు స్ర్కిప్ట్ మరియు క్లాప్ ను అందజేసారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్లాప్ కొట్టగా, దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, విక్టరీ వెంకటేష్ కెమెరా ఆపరేటర్ చేసారు.


Video Source: NTV Telugu

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... బాలయ్య తన 100వ సినిమాను ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’గా ఎంచుకోవడం మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను. ఇలాంటివి మైలురాయి చిత్రాలు. ఈ 100వ చిత్రం బాలకృష్ణ చరిత్రలో అపూర్వ చిత్రంగా మిగిలిపోవడం ఖాయం. ఇక దర్శకుడు క్రిష్ ను మరియు కథను ఆమోదించడంతోనే సినిమా విజయం అర్థమవుతోంది. ఈమధ్య వచ్చిన ‘కంచె’ వరల్డ్ వార్ చిత్రాన్ని తెరకెక్కించడం కేవలం క్రిష్ వల్లే అయ్యింది. ఇప్పుడు చారిత్రాత్మక కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ని కూడా అద్భుతంగా చూపించగలడు. ఈ పాత్రలో బాలకృష్ణ ఇమిడిపోయి, మనందరిని అలరిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పాత్రలు చేయడం బాలకృష్ణకు అవలీలగా వుంటుంది. ఈమధ్య 100రోజులు ఆగడం గగనమైపోయింది. అలాంటిది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Gautamiputra Satakarni  Chiranjeevi  

Other Articles