ప్రస్తుతం ఎండ తీవ్రత ఎంత అధికంగా వుందంటే చెప్పనలవి గాదు, వడదెబ్బ కోట్టి అనేక మంది పిట్టలా రాలిపోతున్నారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు, ఉదయం నుంచే భానుడు దంచి కోడుతుంటే.. దిక్కుతోచని మనుషులు గ్రీష్మతాపానికి సేద తీర్చుకునేందుకు అనేక పాట్లు పడుతున్నారు. గతంలో వేసవిలో మహిళలు ఆమ్లెట్స్ వేసేవాళ్లు కానీ ప్రస్తుత ఎండ తీవ్రతకు టీ, కాఫీ, సహా అన్నం కూడా వేడికే వండేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదమో.
అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంశానికి సంబంధంచిన టాపిక్ చెబుతారనుకుంటే.. ఎండల గురించేందుకు అనుకుంటున్నారా,,; అక్కడికే వస్తున్నాం.. ఎండలు ఇంతగా మండిపోతున్నా ఆ ఎండల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ‘జనతా గ్యారేజ్’ యూనిట్ సభ్యులు సినిమా కోసం కష్టపడుతూ పనిచేస్తున్నందుకు గానూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ టీంకి హ్యాట్సాఫ్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది.
ఈ భారీ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. గత కొద్దిరోజులుగా ఈ షెడ్యూల్ జరుగుతోన్న ప్రాంతంలో ఎండలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. అయినప్పటికీ యూనిట్ సభ్యులు ఆ ఎండల్ని లెక్కచేయకుండా సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగేలా వారు అన్ని పనులు చేస్తున్నారు. దీంతో.. వారి డెడికేషన్‌కి ఫ్లాట్ అయిన ఎన్టీఆర్ యూనిట్ సభ్యులకు ట్విటర్లో హ్యాట్సాఫ్ చెప్పాడు.
‘ఈ స్థాయి ఎండల్లో కూడా ‘జనతాగ్యారేజ్’ టీమ్ సినిమా కోసం చాలా కష్టపడుతూ పనిచేస్తోంది. వారి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. కాగా.. ప్రస్తుతం భారీ ఎత్తున ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఆగస్టు 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more