Manchu Laxmi sensational comments on telugu star heros

Manchu laxmi sensational comments on telugu star heros

Manchu Laxmi, manchu, Memu Saitham, manchu Laxmi sensational co

Manchu Laxmi sensational comments on Memu Saitham Programmee Press meet. She slam some heros.

తెలుగు స్టార్స్ పై మంచు లక్ష్మీ ఘాటు వ్యాఖ్యలు

Posted: 03/30/2016 04:52 PM IST
Manchu laxmi sensational comments on telugu star heros

మంచు లక్ష్మీ తాజాగా చేస్తున్న ఓ షో మీద టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. మేము సైతం అంటూ షో చేస్తోంది. అయితే దీని గురించి తాజాగా మంచు లక్ష్మీ ప్రెస్ మీట్ పెట్టింది. కానీ ఆ ప్రెస్ మీట్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల మీద సెన్సేషనల్ కామెంట్లు చేసింది. ప్రెస్ మీట్ కు వచ్చిన స్టార్స్ కు మంచు లక్ష్మీ మాట తీరుతో షాక్ కు గురయ్యారట. ఇంతకీ  మంచు లక్ష్మీ ఏం మాట్లాడిందంటే.. మేము సైతం లాంటి ప్రొగ్రామ్ కు బాలీవుడ్ లో అయితే స్టార్ హీరోలు ముందుంటారని కానీ మన తెలుగులో మాత్రం అలాంటి వారు లేరని ఆమె అన్నారు. పైగా ప్రెస్ మీట్ కు వచ్చిన వారిని ఇక్కడికి రప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది.

దాంతో స్టేజ్ మీద కూర్చున్నస్టార్స్ ఆశ్చర్యపోయారట. ఇంతకీ మంచు లక్ష్మీ చెప్పిన ఆ స్టార్ హీరోలు ఎవరో తెలియకపోయినా కానీ ఆమె మాటలు మాత్రం చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి.
మంచు లక్ష్మి తాజాగా కొందరు టాలీవుడ్ హీరోలపై మండి పడింది. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము సైతం కార్యక్రమంలో పాల్గొనమని కొందరు హీరో హీరోయిన్లని అడిగితే, అందులో కొందరు మాత్రమే స్పందించారు. చాలా వరకు హీరోలు ఎలాంటి రిైప్లె ఇవ్వలేదు. ఇలాంటి విషయంలో మన వారికంటే బాలీవుడ్ హీరోలే బెటర్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ మంచువారమ్మాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Laxmi  manchu  Memu Saitham  manchu Laxmi sensational co  

Other Articles