పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఊహించని రేంజులో వున్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినిమాల పరంగా కాకుండా కేవలం తన వ్యక్తిత్వం, పట్టుదల, నిజాయితీ, అహింస, సమాజసేవ వంటి పలు వ్యక్తిగత అంశాలను నచ్చి, మెచ్చి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మరి అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తుంటే అభిమానులు ఊరుకుంటారా చెప్పండి. చేతికి, ఒంటికి తెలియకుండానే నోటితోనే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానమిస్తారు. మాములుగా పవన్ కళ్యాణ్ ఎవరితో కూడా వాగ్విదం పెట్టుకోడు. అలాంటి పవన్ కళ్యాణ్ పై అనవసరంగా చెత్త కామెంట్లు చేస్తుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి. అందుకే బాగా నోటిదురుసు ప్రదర్శించిన ఓ బాలీవుడ్ వ్యక్తికి పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో బుద్ధిచెప్పారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లను ఇటీవలే విడుదల చేసారు. ఈ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాలీవుడ్ సినీ సెలబ్రెటీలు సైతం ‘సర్దార్’పై ప్రశంసలు అందిస్తున్నారు. అలాంటి ‘సర్దార్’ సినిమా మరియు పవన్ కళ్యాణ్ పై బాలీవుడ్ కమెడియన్ కమాల్ ఖాన్ వివాదాస్పద కామెంట్లు చేసాడు.
కమల్ ఖాన్ ‘సర్దార్’ పోస్టర్ మరియు పవన్ కళ్యాణ్ పై చెత్త కామెంట్లు చేయడంతో... పవన్ ఫ్యాన్స్ కమల్ ఖాన్ పై ట్విట్టర్ లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా కమల్ మళ్లీ తన నోటిదురుసును ప్రదర్శిస్తూ.... ‘పవన్ సీ గ్రేడ్ హీరో అంటూనే... ఫ్యాన్స్ తనపై ఎటాకింగ్ ఆపాలని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. నాపై మీరు ఎంత విరుచుకుపడితే.. తన పాపులార్టీ అంత పెరుగుతుంది’ అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
పవన్ కళ్యాణ్ కు వున్న వీరాభిమానులలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఒకడు. అలాంటిది తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై ఎవరో నోటికొచ్చినట్లుగా కామెంట్లు చేస్తుంటే సహించలేక.... కమల్ ఖాన్ పై సంపూ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ‘అవును...అతను(పవన్) కార్టూన్, బ్యాట్మెన్ మాదిరి... నైస్ మీటింగ్ యూ స్నూపీ’ అంటూ ట్వీట్ చేశాడు. కేవలం సంపూర్నేష్ మాత్రమే కాకుండా చాలా మంది అభిమానులు కూడా కమల్ ఖాన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లోకి వచ్చి ఇలాంటి కామెంట్లు చేయమంటూ కమల్ కు వార్నింగ్ లు ఇస్తున్నారు పవన్ అభిమానులు. మరి ఇప్పటికైనా కమల్ తన నోటి దురుసును తగ్గించుకుంటాడో లేక పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతాడో భవిష్యత్తులోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more