Sunil | pawan kalyan | Rajinikanth | movie news | stills

Rajinikanth talks about pawan kalyan

Sunil talks about pawan kalyan, Sunil talks about Rajinikanth, Sunil comments on pawan kalyan, Rajinikanth talks about Pawan kalyan, Sunil latest interview, Sunil interviews, Sunil stills

Rajinikanth talks about Pawan kalyan: telugu actor Sunil talks about power star pawan kalyan and tamil star rajinikanth human being.

సునీల్ చెప్పిన నిజాలు: పవన్ కళ్యాణ్ పై థలైవా కామెంట్స్

Posted: 02/23/2016 11:22 AM IST
Rajinikanth talks about pawan kalyan

ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీకి ఒక్కొక్క సూపర్ స్టార్ నటుడు వుంటారు. తమిళంలో రజనీకాంత్, మలయాళంలో మమ్ముట్టి, హిందీలో అమితాబ్ బచ్చన్... ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ లు వున్నారు. మరి తెలుగులో ఎవరున్నారు? నిజానికి తెలుగులో ఒకప్పుడు కృష్ణగారికి సూపర్ స్టార్ అనే ట్యాగ్ వుంది. ఆ తర్వాత ఆ ట్యాగ్ ఇపుడు ప్రిన్స్ మహేష్ బాబు కంటిన్యూ చేస్తున్నాడు. ఆ విషయం అందరికి తెలిసిందే.

కానీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాబోయే సూపర్ స్టార్’ అని చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా నటుడు సునీల్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేసాడు. సునీల్ నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ పవన్ కళ్యాణ్ గురించి తనకున్న అనుభవాలను పంచుకున్నాడు.


Source Video: I News

సునీల్ మాట్లాడుతూ... రజనీకాంత్ గారితో ‘కథానాయకుడు’ సినిమా చేస్తున్నప్పుడు ‘జల్సా’ సినిమా పోస్టర్ చూపించి... ఇది మా ఫ్రెండ్ సినిమా అని రజనీకాంత్ కు చూపించాను. ఆయన వెంటనే త్రివిక్రమ్ గారు నాకు తెలుసు అని చెప్పారు. ఆ తర్వాత పవన్ గారి ఫోటో చూసి, ఈయనేనండి నెక్స్ట్ సూపర్ స్టార్ అని రజనీకాంత్ అన్నారని సునీల్ చెప్పుకొచ్చారు.

అలాగే పవన్ కళ్యాణ్ గురించి సునీల్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. అదేంటంటే.. నువ్వు పక్కోడికి ఏం జరగాలని అనుకుంటున్నావో.. ముందు అది నీకు జరుగుతుంది. బాగుండాలని కోరుకుంటే ముందు నీకు మంచి జరుగుతుంది. అదే చెడు జరగాలని కోరుకుంటే ముందుగా నీకు చెడు జరుగుతుంది. అది భగవద్గీతలోనే రాసి వుంది. పవన్ కళ్యాణ్ చాలా హ్యూమన్ బీయింగ్. ఈ స్టార్ డమ్, సూపర్ స్టార్, ఈ అభిమానం ఎందుకు వచ్చాయంటే.. అలాంటి మనసున్న వాళ్లకే అలా ఇస్తారని నేను భావిస్తున్నాను అని సునీల్ చెప్పుకొచ్చాడు.


Source Video: I News

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Pawan kalyan  Rajinikanth  Superstar  movie news  stills  

Other Articles