NTR | Janatha Garage | Shooting starts | Mohanlal | Nithya menon | Samantha

Ntr janatha garage shooting started

Janatha Garage Shooting Started, Janatha Garage Shooting updates, NTR Janatha Garage updates, NTR Janatha Garage details, NTR Janatha Garage movie news, NTR, Janatha Garage, Mohanlal, Nithya menon, samantha

NTR Janatha Garage Shooting Started: Young tiger ntr latest film Janatha Garage. Koratala Siva Direction. Mohanlal acts in lead role. Nithya menon, Samantha heroines.

భారీ సెట్లో సందడి చేస్తున్న ‘జనతా గ్యారేజ్’ కుర్రాడు

Posted: 02/23/2016 10:08 AM IST
Ntr janatha garage shooting started

‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్ చిత్రాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఈ చిత్ర షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ప్రారంభమయ్యింది. ఈ సినిమా కోసం భారీ వ్యయంతో నిర్మించిన ఓ భారీ సెట్ లో షూటింగ్ కొనసాగుతుంది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.... యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, ఆయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ ను ఎలా చూడాలి అనుకుంటున్నానో, అలా ఆయన క్యారెక్టర్ ను తీర్చిదిద్దాను. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఆగష్టు 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాను చెన్నై, ముంబై, హైదరాబాద్ మరియు కేరళలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ జరుపనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  Mohanlal  Nithya menon  samantha  

Other Articles