Pawan Kalyan Sardaar Gabbar Singh Set Cost

Pawan kalyan sardaar gabbar singh set cost

Sardaar Gabbar Singh Set Cost Rs 4.5 Crores, Pawan kalyan Sardaar Gabbar singh Bike, Pawan kalyan Sardaar Gabbar singh Bullet, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Pawan Kalyan Sardaar Gabbar Singh Set Cost: Power star pawan kalyan Sardaar Gabbar singh New Model Bike. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

భారీ సెట్లో సర్దార్ గబ్బర్ సింగ్ సందడి

Posted: 01/05/2016 01:16 PM IST
Pawan kalyan sardaar gabbar singh set cost

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ను అందిస్తున్నాడు.

ఇటీవలే గుజరాత్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్ ఈరోజు నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం బంజారా హిల్స్ లోని భూత్ బంగ్లా దగ్గర ఓ స్పెషల్ సెట్ వేశారు. ఈ స్ట్రీట్ కు దగ్గర్లో ఓ పోలీస్ స్టేషన్ సెట్ ను కూడా ఏర్పాటు చేసారు. అలాగే ఈ స్టేషన్ దగ్గర నిజమైన రైల్వే భోగీలను తీసుకొచ్చి పెట్టారు. ఈ సెట్ కోసం దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం.

ఈ సెట్లోనే సినిమాలో వచ్చే మేజర్ సీన్లను చిత్రీకరించనున్నట్లుగా తెలిసింది. ఈ సెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పర్యావేక్షణలో డిజైన్ చేసిట్లుగా సమాచారం. ఇక్కడ దాదాపు నేటి నుంచి 25 రోజులపాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్, కాజల్ తో పాటు రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇందులోని ఓ ముఖ్యమైన పాత్రలో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ నటిస్తుంది. అలాగే పవన్ తో కలిసి రెండు మాస్ మసాలా పాటల్లో చిందులేస్తుంది. యువ నటి సంజన కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.








If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar  Gabbar singh  Shooting updates  Stills  

Other Articles