Simbu granted anticipatory bail

Simbu granted anticipatory bail

Anticipatory Bail Granted For Simbu, Simbu responds on Beep Song Issue, Police hunt for Simbu, Simbu will be arrest, Simbu arrest news, Simbu latest news, Simbu movies, Simbu updates, Anirudh arrest issue, Anirudh latest news, Anirudh songs, Anirudh

Simbu granted anticipatory bail: Tamil star hero Simbu and music director anirudh hot topic in kollywood. Police will arrest simbu ,Anirudh for their 'Beep Song' .

శింబుకు బెయిల్.. కారణాలు!

Posted: 01/05/2016 11:49 AM IST
Simbu granted anticipatory bail

ఎట్టకేలకు తమిళ హీరో శింబుకు కాస్త ఊరట లభించినట్లుగా అయ్యింది. గతకొద్ది రోజులుగా శింబు చేసిన ‘బీప్ సాంగ్’ తమిళనాడులో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా శింబు, అనిరుధ్ లు కలిసి ఈ పాటను రూపొందించడాని మహిళా సంఘాలు గోలెట్టేసాయి. దీంతో వీరిద్దరూ బయటకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే తనపై వస్తున్న తప్పుడు వార్తలపై ఇటీవలే శింబు స్పందించాడు.

శింబు మాట్లాడుతూ... నేనేం పనిగట్టుకొని పబ్లిసిటీ కోసం ఈ పాటను విడుదల చేయలేదు. అసలు నాకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. గత 30 ఏళ్లుగా నేను ఈ చిత్ర పరిశ్రమలో వున్నాను. తమిళ ప్రజలకు శింబు అంటే ఎవరో అందరికి తెలుసు. అలాంటి ఇప్పుడు ఏదో పబ్లిసిటీ కోసం ఇలా పాటలను రూపొందించాను అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కానీ ఈ పాటను నేను అధికారికంగా విడుదల చేయలేదు. ఎవరో పనిగట్టుకుని నాకు ఇలాంటి సమస్యలు పుట్టించాలనే ఉద్దేశంతోనే ఈ పాటను విడుదల చేసారు. గతంలో ‘మన్మధన్’ సినిమా సమయంలో కూడా అమ్మాయిలకు వ్యతిరేకంగా శింబు నటించాడంటూ ఆందోళన చేసారు. కానీ ఆ సినిమా అమ్మాయిల వల్లనే పెద్ద విజయం సాధించింది. పైగా ఆ సినిమాలో అమ్మాయిలకు వ్యతిరేకంగా నేనేం నటించలేదు. నాకు లేడి ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అలాంటిది వారిని కించపరుస్తూ ఎందుకు పాటను రూపొందిస్తాను అని అన్నారు.

కానీ చివరకు మద్రాస్ కోర్టులో శింబుకు ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శింబు కేసును నిన్న(సోమవారం) మళ్లీ విచారణ జరిపిన మద్రాస్ కోర్టు న్యాయమూర్తి.. శింబుకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా వుండేంత బలమైన కారణాలేవి లేవన్నారు. దీంతో వెంటనే బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసారు.

అయితే బీప్ సాంగ్ వ్యవహారంలో పోలీసులు వాయిస్ టెస్ట్ కోసం అనుమరి కోరిన నేపథ్యంలో అందుకు సహకరించాలని శింబును న్యాయమూర్తి ఆదేశించారు. అదేవిధంగా శింబును కోవై, రేస్ కోర్స్ పోలీసులు ఇవాళ విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. దీంతో ఈనెల 11న ఈ విచారణలో శింబు పాల్గొనాలని కోర్టు తీర్పులో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Anticipatory Bail Granted  Anirudh  Police case  Beep song issue  Arrest  

Other Articles