Nannaku Prematho Movie Responce Hit Talk

Nannaku prematho movie responce hit talk

Nannaku Prematho Movie Talk Adurs, Nannaku Prematho Audio Jukebox, Nannaku Prematho Movie News, Nannaku Prematho Movie Posters, Nannaku Prematho Movie stills, Nannaku Prematho Movie Release Date, Nannaku Prematho Audio, Ntr, Rakul Preet Singh

Nannaku Prematho Movie Responce Hit Talk: Young tiger ntr Nannaku Prematho Movie Release on 13 January. Sukumar direction, Devi Sri Prasad Music, Rakul Preet singh heroine.

సెంటిమెంట్ అదుర్స్... ‘నాన్నకు ప్రేమతో’ హిట్టు గ్యారెంటి!

Posted: 01/05/2016 01:47 PM IST
Nannaku prematho movie responce hit talk

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏదైనా సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేప్తే.. ఆ సినిమాకు భారీ ప్రమోషన్స్ జరిగినట్లేననే విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా విషయాల్లో ఈ విషయం నిజమైంది. అయితే సినిమాల విషయంలో ఓ వ్యక్తి రిపోర్ట్ మాత్రం చాలా కరెక్ట్ అవుతూ వస్తోంది.

మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని చూసిన దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలు కౌరా సందు... ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూను ఇచ్చి, బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని తెలిపింది. ఈమె చెప్పినట్లుగా ‘శ్రీమంతుడు’ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఇదే సెంటిమెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు రిపీట్ కానున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా కౌరా సందు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ కాపీ చూసానని, ఎన్టీఆర్ మునుపెన్నడూలేని విధంగా చాలా స్టైలిష్ గా వున్నాడని ప్రశంసించింది. అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని కౌరా సందు చెప్పుకొచ్చింది.

కౌరా మాటలపై యంగ్ టైగర్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిచిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాడిన ‘ఫాలో ఫాలో..’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nannaku Prematho  Hit Talk  Release Date  Jukebox  Rakul Preet Singh  Stills  

Other Articles