ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో విజయ్‌భరత్, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్లుగా పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ చిత్రం 'వినోదం%'. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్ స్టార్ పృథ్వీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ మారుతి ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో హీరో విజయ్‌భరత్, హీరోయిన్ ఆశ్విని తదితరులు పాల్గొన్నారు.
అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాలో ఉన్న విషయం ఏమిటో ట్రైలర్లో చక్కగా చూపించారు. డైరెక్టర్ జైశ్రీరామ్ ఈ చిత్రాన్ని ఎంతో ఫ్యాషన్‌తో చేసినట్లుగా తెలుస్తుంది. యూత్‌ని ఆకర్షించే మంచి ఎంటర్టైనర్ చిత్రంలా ఉంది. తప్పకుండా మంచి విజయం సాధించి.అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను..'అని అన్నారు.
చిత్ర నిర్మాత పొట్నూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ..'అవుట్ అండ్ అవుట్ 100% కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. బ్యాంకాక్, థాయిలాండ్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. రాబోయే క్రిస్టమస్ సందర్భంగా ఆడియోను విడుదల చేయనున్నాము..ట్రైలర్‌ని ఆవిష్కరించిన మారుతిగారికి ధన్యవాదాలు..' అన్నారు.
చిత్ర దర్శకుడు జైశ్రీరామ్ మాట్లాడుతూ..'బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు, బాయిలింగ్ స్టార్ పృథ్వీల కామెడీ హైలైట్‌గా ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కించాము. మా హీరో విజయ్‌భరత్ చక్కని అభినయాన్ని కనబర్చాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా నిర్మించేందుకు సహకరించారు...మేం అడిగిన వెంటనే మారుతిగారు మా చిత్ర ట్రైలర్ ఆవిష్కరించినందుకు..ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..' అన్నారు.
సంపూర్ణేష్‌బాబు, పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌భరత్, అశ్విని, కాంచన, సత్యం రాజేష్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, తాగుబోతు రమేష్, శకలకశంకర్, జీవా మొదలగువారు ఇతర తారాగణం.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: సుభాష్ ఆనంద్, కెమెరా: రాజేష్, ఎడిటింగ్: నందమూరిహరి, నిర్మాత: పొట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జైశ్రీరామ్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more