Garam Movie Audio Release Date

Garam movie audio release date

Garam Audio launch on 23 December, Garam Movie Teaser, Aadi Garam Teaser, Garam movie latest news, Garam movie stills, Garam movie posters, Garam movie updates, Garam movie details, Prabhas, Aadi

Garam Movie Audio Release Date: Garam 2015 Telugu movie Teaser featuring Aadi, Adah Sharma, Brahmanandam and Shakalaka Shankar. Directed by Madan. Music directed by Agasthya. Produced by Surekha P. Audio launch on 23 December:

ఆది పుట్టినరోజున ‘గరం’ ఆడియో విడుదల

Posted: 12/19/2015 06:08 PM IST
Garam movie audio release date

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'. ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. ఈ నెల 23న ఆది బర్త్ డే. ఈ సందర్భంగా 'గరం' ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుంది. అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలో పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొననున్నారు. 'పెళ్లైన కొత్తలో' ఫేం అగస్త్య ఈ చిత్రానికి స్వరాలందించారు.

ఈ సందర్భగా పి. సురేఖ మాట్లాడుతూ... ''కథాబలం ఉన్న ఈ చిత్రంలో పాటలకు స్కోప్ ఉంది. అగస్త్య అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. మంచి మ్యూజికల్ హిట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా అన్ని అంశాలూ ఉన్న మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. ఇటీవల ప్రభాస్ విడుదల చేసిన ఈ చిత్రం మొదటి టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతాయనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

మదన్ మాట్లాడుతూ... ''ద్వేషించే వారిని ప్రేమించే స్థాయికి ఎదగడం చాలా కష్టం. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్రం చేశాం. శ్రీనివాస్ చెప్పిన ఈ కథ నచ్చి, సినిమా చేశాం. ఇప్పటివరకూ చేసిన చిత్రాల ద్వారా తనలో మంచి నటుడు ఉన్నాడని ఆది నిరూపించుకున్నాడు. ఈ చిత్రం నటుడిగా తనకు మరింత పేరు తెచ్చిపెడుతుంది. పాత్రను ప్రేమించి చేశాడు'' అని తెలిపారు.

ఆది మాట్లాడుతూ - ''స్ర్కీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ ఇచ్చిన కథను మదన్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. అగస్త్య మంచి పాటలిచ్చారు'' అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బాబ్జీ, కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Garam  Aadi  Audio Release Date  Trailers  stills  

Other Articles