Renu Desai Tweets on indian society

Renu desai tweets on indian society

Renu Desai tweets, Renu Desai angry on society, Renu Desai latest tweets, Renu Desai stills, Renu Desai latest updates, Renu Desai gallery

Renu Desai Tweets on indian society: Actress and Director Renu Desai Tweets on society and justice. Renu Desai latest stills, news, gossips, gallery.

మహిళలపై అత్యాచారం... జైల్లో తెగ సేవలు

Posted: 12/19/2015 04:18 PM IST
Renu desai tweets on indian society

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చాలా యాక్టివ్ గా వుంటుందనే విషయం అందరికి తెలిసిందే. మొన్నటివరకు సినిమాలు, అభిమానులపై కామెంట్లు చేసిన రేణు... ఈసారి దేశ పరిస్థితిపై తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

తాజాగా భారత దేశంలో మహిళలపై, బాలికలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై, అకృత్యాలపై ఆమె మండిపడ్డారు. భారతీయ సాంప్రదాయంలో కొన్ని పండగలకు రావణదహన కాండ జరిపిస్తుంటాం. కానీ దేశంలో మహిళలపై అత్యాచారం చేస్తున్న నిజమైన రావణాసురులను శిక్షించడం లో విఫలమవుతున్నాం. నిజాయతీగా కష్టపడి పనిచేసి పన్నులను సకాలంలో చెల్లించాలి.. మనం చెల్లించే పన్నులతో నేరాలకు పాల్పడేవారు జైల్లో హాయిగా తింటూ, కష్టం అనేది తెలియకుండా జీవిస్తుంటారు అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది.

రేణు చేసిన ఈ వ్యాఖ్యలకు భిన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు రేణుకు మద్ధతుగా నిలుస్తుంటే మరికొందరేమో రేణు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. మొత్తానికి మళ్లీ రేణు దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  tweets  angry  society  stills  

Other Articles