NTR Apologizes Nandamuri Balakrishna

Ntr apologizes nandamuri balakrishna

NTR Apologizes to Balakrishna, Ntr Called to Balakrishna, Ntr Called Nandamuri Balakrishna to apologize, NTR Apologizes, Balakrishna Dictator Audio Venue, Balakrishna Dictator movie news, Balakrishna Dictator movie updates, Balakrishna Dictator stills, Balakrishna, Dictator, NTR, Nannaku Prematho

NTR Apologizes Nandamuri Balakrishna: As per latest Sources say that NTR called Nandamuri Balakrishna and apologized over the phone recently.

బాలయ్యకు ఎన్టీఆర్ క్షమాపణలు... కారణాలేమిటంటే!

Posted: 12/19/2015 11:48 AM IST
Ntr apologizes nandamuri balakrishna

తాజా సమాచారం ప్రకారం నందమూరి అభిమానులకు త్వరలోనే ఓ శుభవార్త రానుందని తెలుస్తోంది. అందుకు గల కారణం నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గతకొద్ది కాలంగా బాలయ్య - తారక్ లకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే విషయం తెలిసిందే. ‘అదుర్స్’ ఆడియో వేడుక తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఏ వేదికపై కూడా కనిపించలేదు.

బాలయ్య సినిమాలకు సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా తారక్ ప్రస్తావన రాదు కానీ... తారక్ కు సంబంధించిన అన్ని కార్యక్రమంలో బాలయ్య ప్రస్తావన ఖచ్చితంగా వుంటుంది. అందుకు తగ్గట్లుగా తారక్ కూడా బాలయ్య గురించి పాజిటివ్ గానే మాట్లాడుతూ, అభిమానులు సంతోషపరుస్తుంటాడు. ఇదిలా వుంటే బాలయ్యతో కోల్డ్ వార్ ను బ్రేక్ చేసేందుకు తారక్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా సమాచారం ప్రకారం... ఇటీవలే బాలయ్యకు తారక్ ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు ఫోన్ చేసి, తారక్ క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ బాలయ్య ఎలా స్పందించారనే విషయం ఇంకా తెలియలేదు. బాలయ్య గనుక సానుకూలంగా స్పందిస్తే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఒకవేళ బాలయ్య నుంచి తారక్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడు విశేషాలు జరుగనున్నాయి.

అందులో ఒకటి.. బాలయ్య ‘డిక్టేటర్’ ఆడియో వేడుకకు తారక్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేస్తాడు. అలాగే రెండవది ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తాడు. ఇవే కాకుండా మరో మూడవ బంపర్ ఆఫర్ ఏమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా ముందుగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇపుడు వీరిద్దరూ కలిస్తే... ‘డిక్టేటర్’ సంక్రాంతికి విడుదలైన తర్వాతనే తారక్ తన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.

మరి ఈ మూడు విశేషాలు జరగాలంటే బాలయ్య సానుకూలంగా స్పందించి, తారక్ క్షమాపణలను మన్నిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘డిక్టేటర్’ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ‘డిక్టేటర్’ ఆడియోను ఈనెల 20న అమరావతిలో విడుదల చేయనున్నారు. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే స్పెయిన్ లో షూటింగ్ పూర్తి చేసుకొని, చిత్ర యూనిట్ హైదరాబాద్ కు తిరిగొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేసి, సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరి ‘నాన్నకు ప్రేమతో’ అంటూ బాలయ్య బాబాయ్ కు ఫోన్ చేసిన తారక్ కు ‘డిక్టేటర్’ ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Balakrishna  NTR  Apologizes  Dictator  Nannaku Prematho  stills  

Other Articles