Actor Ravi kishan injured in Supreme shooting

Actor ravi kishan injured in supreme shooting

Ravi kishan injured in supreme shooting: Bhojpuri actor Ravi Kishan was injured in Jaisalmer to shoot for a Telegu film Supreme. Saidharam tej, Rashi khanna acts in lead roles. anil ravipudi director.

Ravi kishan injured in supreme shooting: Bhojpuri actor Ravi Kishan was injured in Jaisalmer to shoot for a Telegu film Supreme. Saidharam tej, Rashi khanna acts in lead roles. anil ravipudi director.

‘సుప్రీం’లో గాయాలపాలైన ‘రేసుగుర్రం’ విలన్

Posted: 12/19/2015 11:02 AM IST
Actor ravi kishan injured in supreme shooting

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రంలో ‘మత్తాలీ శివారెడ్డి’ పాత్రలో విలన్ గా తన అద్భుత ప్రతిభను చూపించన భోజ్ పురి నటుడు రవికిషన్ తాజాగా గాయాలపాలయ్యారు. ‘రేసుగుర్రం’ తర్వాత రవికిషన్ కు తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ.. అందులో చక్కటి కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం రవికిషన్ నటిస్తున్న చిత్రం ‘సుప్రీం’. సాయిధరమ్ తేజ హీరోగా ‘పటాస్’ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతోంది. ఇందులో సాయిధరమ్ తేజ్, రవికిషన్ ల మధ్య ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. రవికిషన్ గాయపడ్డాడు. దీంతో అక్కడే ప్రథమ చికిత్స చేసినప్పటికీ, మెరుగైన వైద్యం కోసం ఆయనను ముంబై తరలించారు.

ఇందులో సాయిధరమ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాశిఖన్నా నటిస్తుంది. కమర్షియల్ మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi kishan  injured  Supreme  Rashi khanna  shooting  stills  

Other Articles