Dictator Movie Audio on 20 December

Dictator movie audio on 20 december

Balakrishna Dictator Movie Audio Date, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Dictator Movie Audio on 20 December: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

‘డిక్టేటర్’ కోసం రిస్క్ చేస్తున్న నందమూరి నటసింహం

Posted: 12/18/2015 04:12 PM IST
Dictator movie audio on 20 december

ప్రతి ఒక్కరికి వయసు పెరిగితే అలుపొస్తుందేమో.. కానీ బాలయ్యకు వయసు పెరిగినకొద్ది ఊపొస్తుంది. నందమూరి బాలకృష్ణకు వయసు పెరుగుతున్న కూడా తన ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. యాక్టింగ్, డాన్సింగ్, యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య ఎనర్జీ ఏంటో అందరికి తెలిసిందే. అలాంటి బాలయ్య మరోసారి తన జోష్ ను చూపించడానికి ఓ సాహసం చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. ఇందులో దాదాపు 150మంది ఫైటర్స్ తో ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. అయితే ఇందులో కొన్ని రిస్కీ ఫైట్లు వుండటం వల్ల డూప్ ను వాడదామని ఫైట్ మాస్టర్స్, డైరెక్టర్స్ అనుకున్నప్పటికీ... బాలయ్య మాత్రం నో చెప్పేసారట. ఎలాంటి డూప్ అవసరం లేకుండా, ఎంతటి రిస్క్ అయినా చేయడానికి తాను సిద్ధమేనని బాలయ్య చెప్పాడట. దీంతో బాలయ్య ఆ సీన్లో ఎలాంటి డూప్ లేకుండా నటిస్తున్నాడు.

ఈ భారీ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్ కానుందని సమాచారం. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 20వ తేదిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Audio Release Venue  Anjali  sonal chauhan  stills  

Other Articles