Sunil Mannara film Vizag Schedule completed

Sunil mannara film vizag schedule completed

Sunil Mannara film Vizag Schedule completed, Sunil next film title Bhatudu, Sunil Romance with Mannara Chopra, Actor Sunil latest news, Actor Sunil movie news, Actor Sunil movie updates, Actor Sunil movies, Actor Sunil latest movie updates, Actor Sunil movie details, Actor Sunil upcoming movies, Mannara Chopra in tollywood, Mannara Chopra

Sunil Mannara film Vizag Schedule completed: Telugu Actor Sunil upcoming film under vamshi krishna aakella direction. R Sudhershan reddy producer. Mannara Chopra Heroine.

వైజాగ్ లో సునీల్-మన్నారాల రొమాన్స్ పూర్తి

Posted: 12/18/2015 03:59 PM IST
Sunil mannara film vizag schedule completed

న‌టుడుగా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌ల‌తో న‌వ్వించి, హీరోగా సూప‌ర్ స‌క్సస్ లు సాధించిన సునీల్ హీరోగా, జిద్ చిత్రంతో బాలీవుడ్ కుర్ర‌కారు హుషారెక్కించిన మ‌నార్ చోప్రా హీరోయిన్ గా, ర‌క్ష లాంటి టెర్రిఫిక్ క‌థాంశంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంశ‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ ద‌ర్శ‌కుడిగా, చిన్నచిత్రాల్లో బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిల‌వ‌ట‌మే కాకుండా కొత్త జాన‌ర్ ని తెలుగు సినిమా ఇండ‌స్ట్రికి ప‌రిచ‌యం చేసిన ప్రేమ‌క‌థా చిత్రమ్ సినిమాతో ఉత్త‌మాభిరుచి వున్న నిర్మాతగా ప్ర‌శంశ‌లు అందుకున్న నిర్మాత‌ ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-2 గా నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ ఇటీవ‌లే వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ప‌లు అంద‌మైన ప్ర‌దేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. త‌దుప‌రి షెడ్యూల్ ని హైద‌రాబాద్ లో చేస్తారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థా చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం త‌రువాత మా బ్యాన‌ర్ ఆర్‌.పి.ఏ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే వైజాగ్ లోని 35 రోజుల‌పాటు నాన్‌స్టాప్ గా షూటింగ్ జ‌రుపుకున్నాము. హీరో సునిల్, జిల్ ఫేం క‌భీర్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, ఉద‌య్ ల కాంబినేష‌న్ లో క‌న‌ల్‌క‌ణ్ణ‌న్ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించాము. ఈ యాక్ష‌న్ చిత్రానికి ఓ హైలెట్ గా నిలుస్తుంది. అలాగ్ హీరో సునిల్, హీరోయిన్ మ‌న్నార్ చోప్రాల‌పై కొన్నిసన్నివేశాలు చిత్రీక‌రించాము. మ‌రి కొన్ని కామెడి స‌న్నివేశాలు స‌ప్త‌గిరి కాంబినేష‌న్ లో చిత్రీకరించాము. మా చిత్రంలో స‌ప్త‌గిరి గెట‌ప్ నే ఆద్యంతం న‌వ్వించే విదంగా వుంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ చిత్రం లోకూడా ఇలాంటి గెట‌ప్ తో స‌ప్త‌గిరి క‌నిపించ‌లేదు. మా బ్యాన‌ర్ లో వ‌చ్చిన‌ ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత స‌ప్త‌గిరి కామెడి ఈ చిత్రం లో చాలా బాగుంటుంది. అలాగే హీరో సునిల్ గారి కాస్ట్యూమ్స్ ద‌గ్గ‌ర నుండి అన్ని క‌థ‌కి రిలేటెడ్ గా వుంటాయి. మ‌న్నార్ చోప్రా చాలా అందంగా న‌టిస్తుంది. వైజాగ్ బీచ్ ని మ‌రింత అందంగా చూపించారు మా సినిమాటోగ్రాఫ‌ర్ సి. రామ్‌ప్ర‌సాద్ గారు, మా తదుపరి షెడ్యూల్ హైద‌రాబాద్ చేస్తాము. అతిత్వ‌ర‌లో చిత్రం టైటిల్ ని ఎనౌన్స్ చేస్తాము. ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ చాలా క్లారిటితో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎంతో ఆశ‌క్తిగా ఉత్కంఠ భ‌రితంగా, ఉహించ‌ని మలుపుల‌తో, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ ని మించి కామెడి తో ఈ చిత్రం క‌థ వుంటుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్నిఅల‌రిస్తుంది. అని అన్నారు

ద‌ర్శ‌కుడు వంశి కృష్ణ ఆకేళ్ళ మాట్లాడుతూ.. నిర్మాత ఆర్‌. సుద‌ర్శ‌న్ రెడ్డి గారితో ఈచిత్రం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం లో సునీల్ గారు కామెడి టైమింగ్ మిస్ కాకుండా యాక్ష‌న్ చేస్తారు. అంతే కాకుండా ఊహించ‌ని మ‌లుపుల‌తో కోత్త‌గా వుంటుంది. స‌ప్త‌గిరి ఈ చిత్రంలో ఫుల్‌ప్లెడ్జ్‌డ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. హీరో సునీల్ స‌రస‌న బాలీవుడ్ హీరోయిన్ మ‌న్నార్ చోప్రా న‌టిస్తుంది. అనుకున్న విధంగానే విజ‌య‌వంతంగా వైజాగ్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం. ఈచిత్రం సునీల్ గారి అభిమానుల‌తో పాటు తెలుగు ప్రేక్ష‌కులంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.. అని అన్నారు..

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో సునీల్‌, మ‌న్నార్ చోప్రా(ప‌రిచ‌యం), క‌భీర్ సింగ్‌(జిల్ ఫేమ్‌), సప్త‌గిరి , నాగినీడు,స‌త్య‌ప్ర‌కాష్‌, ఆనంద్ రాజా, రాజార‌వీంద్ర‌, అదుర్స్ ర‌ఘు, ఉద‌య్‌, ప్ర‌బాస్ శీను త‌దిత‌రులు న‌టిస్తుండ‌గా.. సంగీతం:ధినేష్‌, ఆర్ట్ : మ‌ర‌ళిధ‌ర్‌, కెమెరా: సి.రామ్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్ :ఎమ్.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్స్ : రామ‌చంద్రరావు, శివాంజ‌నేయులు, కాస్ట్యూమ్స్: మ‌స్తాన్‌, పి.ఆర్‌.వో: ఏలూరు శ్రీను, స‌హ‌-నిర్మాత‌లు: మాస్ట‌ర్ ఆర్‌.ఆయుష్ రెడ్డి, ఆర్‌.పి.అక్షిత్ రెడ్డి, నిర్మాత‌.:ఆర్‌.సుద‌ర్శ‌న్ రెడ్డి, క‌థ‌-స్కీన్‌ప్లే -ద‌ర్శ‌కత్వం :వంశి కృష్ణ ఆకేళ్ళ‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Bhatudu  Mannara Chopra  Hot stills  Movie News  

Other Articles