ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె .ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ చాలా బాగుంది. ఈ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో నాగశౌర్య, మాళవిక నాయర్ లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల చివర్లో ఈ చిత్ర ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రేమ, పెళ్లి వంటి అంశాలతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు. నటీనటులు: నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు.
సాంకేతిక నిపుణులు: సంగీతం: కళ్యాణ్ కోడూరి; సినిమాటోగ్రఫీ : జి.వి.ఎస్. రాజు; ఎడిటర్ : జునైద్ సిద్దిక్; కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని; యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు; కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి; డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్; కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి; ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్; స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more