Simbu and Anirudh targetted by police

Simbu and anirudh targetted by police

Police hunt for Simbu, Simbu will be arrest, Simbu arrest news, Simbu latest news, Simbu movies, Simbu updates, Anirudh arrest issue, Anirudh latest news, Anirudh songs, Anirudh

Simbu and Anirudh targetted by police: Tamil star hero Simbu and music director anirudh hot topic in kollywood. Police will arrest simbu ,Anirudh for their 'Beep Song' .

శింబు, అనిరుధ్ ల కోసం పోలీసుల వేట

Posted: 12/16/2015 11:10 AM IST
Simbu and anirudh targetted by police

‘బాయ్స్’ సినిమాలో ఏదో ఒక కులం, వర్గం గురించి విప్లవాత్మకంగా పాట రాసి, పాడినందుకు అందులోని హీరోహీరోయిన్లకు జైలు శిక్ష విధిస్తారు. కాకపోతే అది సినిమాలోని ఓ సన్నివేశం మాత్రమే. కానీ నిజజీవితంలో కూడా తాజాగా అలాంటి పరిస్థితే వచ్చింది తమిళ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్లకు.

తమిళ స్టార్ హీరో శింబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ లు ఇటీవలే ‘బీప్ సాంగ్’ అనే పేరుతో ఓ పాటను రూపొందించారు. ఈ పాట ప్రస్తుతం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో మహిళలను అగౌరవపరిచే విధంగా అసభ్యపదజాలాలతో కూడిన పాట రాసి, పాడారంటూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి.

శింబు, అనిరుధ్ లపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా మహిళా సంఘాలు కోవై పోలీస్ కమీషనర్ అమల్ రాజ్ కు ఫిర్యాదు చేసారు. కమీషనర్ ఆదేశాల మేరకు కోవై రేస్ కోర్స్ పోలీసులు శింబు, అనిరుధ్ లపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడానికి రెండు రోజలు క్రితమే చెన్నై వచ్చారు. అయితే శింబు గతకొద్ది రోజులుగా ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శింబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఎలాగైనా శింబును అరెస్ట్ చేసి, తీసుకురావాలని కమీషనర్ గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కోవై రేస్ కోర్స్ పోలీసులు చెన్నైలోనే మాకాం వేసి, శింబు కోసం చెన్నై మొత్తం జల్లెడ పడుతున్నారు. మరోపక్క మాదర్ సంఘానికి చెందిన వారు శింబు ఇంటిని చుట్టుముట్టి ఆయనను అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.

ఇక అనిరుధ్ కెనడా లో వుండటం వలన.. ఆయన వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్దమయినట్లుగా తెలిసింది. శింబు తనకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. మొత్తానికి వీరిద్దరూ ఏదో సరదా కోసం చేసిన ఈ పాట తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంకా ఈ విషయంలో శింబు, అనిరుధ్ లు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కోనున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Anirudh  Police case  Beep song issue  Arrest  

Other Articles