Rajinikanth Robot2 movie shooting starts

Rajinikanth robot2 movie shooting starts

Robot2 movie shooting starts today, Robot2 movie updates, Robot2 shooting starts, Robot2 latest news, Robot2 movie details, Rajinikanth movies, Rajinikanth movie updates, Rajinikanth stills, Rajinikanth

Rajinikanth Robot2 movie shooting starts: Tamil Superstar Rajinikanth latest film Robot2. Shankar director. AR Rahaman music.

‘రోబో2’గా సందడి చేస్తున్న సూపర్ స్టార్

Posted: 12/16/2015 10:09 AM IST
Rajinikanth robot2 movie shooting starts

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన ‘రోబో’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. రజనీకాంత్ రోబో పాత్రలో అదరగొట్టేసాడు. ఇందులో రజనీకాంత్ సరసన ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగించింది.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘రోబో2’ చిత్రం తెరకెక్కుతోంది. ‘రోబో2’ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. షూటింగ్ లో రజనీకాంత్ మరియు ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. అయితే ఇందులో రోబోకు విలన్ గా ఎవరు నటించనున్నారనే విషయంపై ఇంకా ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. గతకొద్దిరోజుల క్రితం వరకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ విలన్ పాత్రలో నటించనున్నాడని వార్తలొచ్చాయి కానీ రెమ్యునరేషన్ విషయంలో అతడిని తొలగించినట్లుగా తెలుస్తోంది.

ఇక ‘రోబో’లో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించింది. మరి ‘రోబో2’లో ఎవరూ హీరోయిన్ గా నటించనున్నారో చూడాలి. ఆమీ జాక్సన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి శంకర్ అధికారికంగా ప్రకటించే వరకు వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Robot2  Shooting stats  Shankar  stills  

Other Articles