Madhavan Saala Khadoos Official Trailer

Madhavan saala khadoos official trailer

Saala Khadoos Official Trailer, Saala Khadoos trailer, Saala Khadoos stills, Saala Khadoos posters, Saala Khadoos movie release date, Saala Khadoos news, Madhavan movies, Madhavan movie trailer, Ritika Singh hot stills, Ritika Singh stills

Madhavan Saala Khadoos Official Trailer: Rajkumar Hirani Films & Tricolour Films in association with UTV Motion Pictures present Saala Khadoos. The film releases on 29th Jan.

అంచనాలు పెంచేస్తున్న ‘సాలా ఖడూస్’ ట్రైలర్

Posted: 12/16/2015 11:18 AM IST
Madhavan saala khadoos official trailer

లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సాలా ఖడూస్’. ఇందులో మాధవన్ ఓ బాక్సింగ్ ట్రైనర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

ఒక బాక్సింగ్ ట్రైనర్ గా కనిపించడానికి మాధవన్ ఈ సినిమా కోసం తన బాడీని చాలా పెంచేసి, ఫిట్ గా తయారయ్యాడు. తన ఇమేజ్ ను పక్కనపెట్టేసి, హెయిర్ స్టైల్, గడ్డం బాగా పెంచేసి బ్యాడ్ బాయ్ లుక్ లో కనిపించేస్తున్నాడు. కానీ మాధవన్ ఈ రఫ్ లుక్ లో కూడా బాగున్నాడు. ఇందులో రితిక సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. రితికకు మాధవన్ బాక్సింగ్ ట్రైనర్ గా కనిపిస్తాడు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాణీ, ఆర్. మాధవన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళంలో వచ్చే ఏడాది జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుండనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhavan  Saala Khadoos  Official Trailer  Ritika Singh  Release Date  Stills  

Other Articles