Raj Tarun Kumari 21F Movie Censor Report

Raj tarun kumari 21f movie censor report

Kumari 21F Movie Censor Report, Kumari 21F Movie Release Date, Kumari 21F Movie Posters, Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

Raj Tarun Kumari 21F Movie Censor Report: Actor Raj tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine. Kumari 21F Movie Release on 20 November.

సుకుమార్ కుమారికి సెన్సార్ A సర్టిఫికెట్

Posted: 11/16/2015 01:26 PM IST
Raj tarun kumari 21f movie censor report

రాజ్ తరుణ్, హేభ పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమయ్యింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే కథ, స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. దేవి సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ వారు A సర్టిఫికెట్ ను అందించారు.

యూత్ ఫుల్, రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చాలా బోల్డ్ సన్నివేశాలున్నాయని తెలిసింది. యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో వున్నారు. ఈ సినిమాను ఈనెల 20న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ‘కుమారి21ఎఫ్’ ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  Raj Tarun  Censor Report  Release Date  Hebha patel  

Other Articles