OU students stopped Emraan Hashmi Azhar movie shooting

Ou students stopped emraan hashmi azhar movie shooting

OU students stop Azhar movie shooting, Azhar movie shooting stopped, Azhar movie news, Azhar movie latest news, Azhar movie stills, Emraan Hashmi movies, Emraan Hashmi stills, Emraan Hashmi songs, Emraan Hashmi

OU students stopped Emraan Hashmi Azhar movie shooting: Azhar movie based on the life of cricketer Mohammed Azharuddin, came to a standstill in OU Sunday.

ఓయూలో ‘అజార్’ యూనిట్ కు ఘోర అవమానం

Posted: 11/16/2015 11:39 AM IST
Ou students stopped emraan hashmi azhar movie shooting

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఘోర అవమానం జరిగింది. ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న తాజా చిత్రం ‘అజార్’. ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ను తాజాగా హైదరాబాద్ లోని ఓయూ క్యాంపస్ లో జరపడానికి ప్లాన్ చేసారు.

ఇందుకు గాను తగిన అనుమతులు, ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు చిత్ర యూనిట్. షూటింగ్ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాక, చిత్ర నటీనటులు వచ్చిన తర్వాత ఓయూ క్యాంపస్ విధ్యార్థులు షూటింగ్ ను అడ్డుకున్నారు. ఓయూ విధ్యార్థులకు చిత్ర నిర్వాహాకులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమిలేక షూటింగ్ ను నిలిపివేసారు.

అనంతరం యూనిట్ నిర్వహాకులు మాట్లాడుతూ... షూటింగ్ నిర్వహించుకునేందుకు తాము ముందుగానే అన్ని అనుమతులు తీసుకున్నామని, కానీ ఇలా షూటింగ్ ను అడ్డుకోవడం సరైనది కాదని మండిపడ్డారు. షూటింగ్ నిలిపివేయడంతో తమకు దాదాపు 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు వచ్చి తాము అడిగినంత డబ్బులిస్తే షూటింగ్ జరగనిస్తామని, లేదంటే షూటింగ్ జరగకుండా అడ్డుకుంటామని బెదిరించారని చెప్పుకొచ్చారు.

మొత్తానికి ‘అజార్’ చిత్ర యూనిట్ కు ఓయూలో భారీ అవమానమే జరిగినట్లుగా తెలుస్తోంది. అసలు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా విధ్యార్థులు అడ్డుకోవడానికి గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. మరి ఓయూలోనే షూటింగ్ జరుపుతారో లేక లొకేషన్ చేంజ్ చేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Emraan Hashmi  OU students stop  Azhar  news  stills  

Other Articles