Thala Ajith Knee Surgery Successfully completed

Thala ajith knee surgery successfully completed

Thala Ajith Knee Surgery Successful, Thala Ajith Knee Surgery, Ajith Knee Surgery Successful, Ajith Knee Surgery, Ajith movies, Ajith movie news, Ajith stills, Ajith latest movies, Ajith vedalam collections, Ajith

Thala Ajith Knee Surgery Successfully completed: Tamil star hero Thala Ajith Knee Surgery Successful completed. Ajith latest film Vedalam became block buster hit.

థలా ఆపరేషన్ సక్సెస్... ఆనందంలో ఫ్యాన్స్!

Posted: 11/14/2015 12:22 PM IST
Thala ajith knee surgery successfully completed

తమిళంలో వరుసగా తన సినిమాలతో హిట్లుకొడుతూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న స్టార్ హీరో థలా అజిత్ కు తాజాగా ఆపరేషన్ జరిగింది. గతంలో అజిత్ నటించిన ‘ఆరంభం’ సినిమా షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యాడు. అజిత్ మోకాలుకు బలమైన గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు ఆపరేషన్ చేసుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ అజిత్ మాత్రం అలాంటివేమి పట్టించుకోకుండా కేవలం తాత్కాలికంగా చికిత్స చేయించుకుంటూ సినిమాను పూర్తి చేసి, తర్వాత మరో రెండు చిత్రాల్లో కూడా నటించారు. దీంతో ఆపరేషన్ ను వాయిదా వేస్తూ వచ్చారు.

కానీ ఇటీవలే అజిత్ నటించిన ‘వేదలం’ సినిమా షూటింగ్ సమయంలో కూడా అదే కాలికి దెబ్బ బలంగా తగిలింది. కానీ ఆ నొప్పి భరించి, సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు. ఇటీవలే విడుదలై తమిళంలో కలెక్షన్ల మోత మ్రోగిస్తూ, రికార్డులు క్రియేట్ చేస్తోంది. కానీ మోకాలి నొప్పి మరింత ఎక్కువ కావడం, తర్వాత సినిమా షూటింగ్ కు కాస్త సమయం దొరకడంతో గురువారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అజిత్ తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నారు.

అభిమానుల ఆశీస్సులతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకుండా, ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. రేపు ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిసింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అజిత్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లి, అక్కడ రెండు నెలలు విశ్రాంతి తీసుకొని, చెన్నైకు తిరిగి రానున్నట్లుగా తెలిసింది. ఏదేమైనా అజిత్ ఆరోగ్యం ప్రస్తుతం క్షేమంగా వుండటంతో అభిమానులు సంతోషంగా వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith  Knee Surgery  Vedalam  Collections  Stills  

Other Articles