Heroine Laxmi Raai Suffering with Viral Fever

Heroine laxmi raai suffering with viral fever

Laxmi Raai viral fever, Laxmi Raai fever, Laxmi Raai hot stills, Laxmi Raai in Sardaar Gabbar singh, Laxmi Raai spicy dance, Laxmi Raai Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills

Heroine Laxmi Raai Suffering with Viral Fever: Kollywood hot actress Laxmi Raai down with Viral Fever. Power star pawan kalyan Sardaar Gabbar singh New Model Bike. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సర్దార్ భామ

Posted: 11/14/2015 03:51 PM IST
Heroine laxmi raai suffering with viral fever

టాలీవుడ్ హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మీకి వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎన్ని మందులు వాడిన కూడా తగ్గడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా రాయ్ లక్ష్మీయే తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా తన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో చూస్తుంటే రాయ్ లక్ష్మీకి బాగానే జ్వరం వచ్చినట్లుగా కనిపిస్తోంది.

తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్న ఈ అమ్మడు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే పవన్ తో కలిసి ఓ హాట్ మాస్ మసాలా సాంగ్ లో చిందులేసింది. ఇటీవలే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.

రాయ్ లక్ష్మీ ఫీవర్ ఎప్పుడు తగ్గుతుందో ఏమో తెలియదు కానీ.. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ అమ్మడు నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Laxmi Raai  fever  Pawan kalyan  Sardaar Gabbar singh  Stills  

Other Articles