Renu Desai safe and tweets on Paris Attacks

Renu desai safe and tweets on paris attacks

Renu Desai safe from Paris Attacks, Renu Desai tweests on Paris Attacks, Renu Desai tweets, Renu Desai latest tweets, Renu Desai stills, Renu Desai hot news, Renu Desai tweets, Renu Desai photos, Renu Desai

Renu Desai safe and tweets on Paris Attacks: Powerstar Pawan Kalyan Ex wife, Actor, Director Renu Desai safe from Paris attaks. Renu desai tweets about paris attacks.

నేను క్షేమంగానే వున్నాను.. అందరికి థ్యాంక్స్: రేణుదేశాయ్

Posted: 11/14/2015 11:03 AM IST
Renu desai safe and tweets on paris attacks

ప్యారిస్ లో టెర్రరిస్టులు విధ్వాంసకాండ సృష్టించిన విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలిచివేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి, దర్శకురాలు రేణుదేశాయ్ గతవారం ప్యారిస్ కు వెళ్లింది. నిన్న సాయంత్రం వరకు కూడా ప్యారిస్ లో తాను తిరుగుతున్న ప్రదేశాల గురించి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ వచ్చింది.

కానీ నిన్న సాయంత్రం ఆఖరిసారిగా రేణు ట్వీట్ చేసింది. అదే సమయం నుంచి ప్యారిస్ లో బాంబు పేలుళ్లు మొదలయ్యాయి. ఆ తర్వాత రేణు నుంచి ఎలాంటి ట్వీట్స్ రాకపోవడంతో బంధుమిత్రులు, అభిమానులు చాలా కంగారుపడుతున్నారు. రేణుకి ఏం హాని జరగకుండా, క్షేమంగా తిరిగిరావాలంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.



అయితే ఈ విషయం తెలుసుకున్న రేణుదేశాయ్ వెంటనే స్పందించింది. నేను ఇప్పుడే(ఉదయం 9:30నిమిషాలకు) ముంబాయ్ లో ల్యాండ్ అయ్యాను. ప్యారిస్ అటాక్ గురించి ఇపుడే విన్నాను. నేను క్షేమంగానే వున్నాను. నా క్షేమం కోరి మెసేజ్ లు చేసిన వారందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రేణు తన సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసింది.

రేణు దేశాయ్ ట్వీట్స్ చేయడంతో అటు బంధుమిత్రులు, ఇటు అభిమానులు కాస్త ఈ టెన్షన్ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ ప్యారిస్ ఘటనలో ఇప్పటికే దాదాపు 140 మంది వరకు ప్రజలు మృతిచెందారు. అలాగే కొన్ని వందలమంది తీవ్ర గాయాలపాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu Desai  safe  tweets  Paris Attacks  stills  

Other Articles