Actor Prashanth Died by slipping off

Actor prashanth died by slipping off

Tollywood Actor Prashanth Died by slipping off, Actor Prashanth Died by slipping off, Tollywood Actor Prashanth Died, Tollywood Actor Prashanth Death, Tollywood Actor Prashanth Suicide, Tollywood Actor Prashanth Death news, Actor Prashanth Died

Actor Prashanth Died by slipping off: Young choreographer turned actor Prashanth dies in a tragic incident happened at Moosapet, Hyderabad.

అక్రమ సంబంధంతో మరణించిన నటుడు

Posted: 11/14/2015 09:55 AM IST
Actor prashanth died by slipping off

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ బిల్డింగ్ పై నుంచి యువ నటుడు ప్రశాంత్ పడి చనిపోయాడు. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి మరణించినప్పటికీ... అతని మరణంపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లనే ప్రశాంత్ చనిపోయాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై వినిపిస్తున్న అసలు విషయమేమిటంటే...

మూసాపేట ఆంజనేయ నగర్ లో ప్రశాంత్ నివాసం వుంటున్నాడు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా ప్రయత్నిస్తూనే, ‘ఇప్పట్లో రాముడిలా.. సీతలా ఎవరుంటారండి బాబు’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే తన ఇంటికి సమీపంలోనే వుంటున్న ఓ స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. శుక్రవారం రోజున తన ప్రియురాలి భర్త లేకపోవడంతో ఆమె ఇంట్లోకి వెళ్లి సరసాలు సాగించాడు. కానీ ఒక్కసారిగా బంధువులు రావడంతో భయపడ్డ ఈ జంట.. ప్రశాంత్ ను తన ఇంట్లోనే దాచిపెట్టింది ఆ ప్రియురాలు.

తన ఇంట్లో ఎవరూ లేరని, నిద్రపోతానని చెప్పి బంధువులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో అనుమానం వచ్చిన బంధువులు ఇళ్లు తనిఖీ చేస్తుండగా.. ప్రియురాలు తన చేతులు కోసుకొని హడావిడి చేసింది. ఒక్కసారిగా కంగారుపడిన బంధువులు ఆ ఇంటికి తాళం వేసి, ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

ఇంట్లోనే వున్న ప్రశాంత్ తప్పించుకోవడానికి ఇంటి వెనకాల వున్న పైప్ ల ద్వారా కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రశాంత్ స్వస్తలం గుంతకల్లుకు తరలించారు. ఈరోజు అంత్యక్రియలు జరుగుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Actor Prashanth  Died  slipping off Building  stills  

Other Articles