Pawan kalyan | Sardaar | Gabbar singh

Pawan kalyan sardaar gabbar singh special bullet

Pawan kalyan Sardaar Gabbar singh Special Bike, Sardaar Gabbar singh Special Bike, Pawan kalyan Sardaar Gabbar singh Bike, Pawan kalyan Sardaar Gabbar singh Bullet, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills

Pawan kalyan Sardaar Gabbar singh Special Bullet: Power star pawan kalyan Sardaar Gabbar singh New Model Bike. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

సర్దార్ గబ్బర్ సింగ్ బుల్లెట్ కు పెరిగిపోయిన భారీ క్రేజ్

Posted: 11/06/2015 10:27 AM IST
Pawan kalyan sardaar gabbar singh special bullet

‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో గుర్రం, బైక్స్, జీపు... వంటి వాటిపై ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేసాడు. ఈసారి కూడా అలాంటి గుర్రం, బైక్స్ లనే వాడుతున్నాడు. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బైక్ మాత్రం చాలా కొత్తగా డిజైన్ చేసారు.

Sardaar-Gabbar-singh-Specia

తాజాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన బైక్ ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ బైక్ చాలా మాసివ్ లుక్ లో అదరగొడుతోంది. బైక్ ముందు భారీ గన్స్ పెట్టుకోవడానికి ఓ పెద్ద గన్ పాకెట్ ను ఏర్పాటు చేసారు. అంతేకాకుండా సైడ్ లో కూడా రివాల్వర్స్ పెట్టుకునేందుకు పాకెట్స్ ను ఏర్పాటు చేసారు. మొత్తానికి గబ్బర్ సింగ్ కే కాకుండా గబ్బర్ సింగ్ వాడే బైక్ కూడా ‘కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని అనిపించేలా వుంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar  Gabbar singh  Bullet  Bike  Stills  

Other Articles