Trisha Ready to marriage Charmme kaur

Trisha ready to marriage charmme kaur

Charmme kaur wants to marry Trisha, Nikhisha patel wants to marry Trisha, Charmme kaur marry Trisha, Charmme kaur wants Trisha, Nikhisha patel marry Charmme, Charmme kaur wants to marry, Charmme kaur, Trisha, Nikhisha patel, Tweets

Trisha Ready to marriage Charmme kaur: Tollywood charming heroine Charmme kaur wants to marry south indian star heroine Trisha. Nikhisha patel also wants to marry charmme.

ఛార్మితో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిష

Posted: 11/03/2015 10:54 AM IST
Trisha ready to marriage charmme kaur

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిషను ఇష్టపడనివారంటూ వుండరు. ఆమె అందం, అభినయం అన్నింటితో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. త్రిషను పెళ్లి చేసుకోవాలని చాలా మంది అబ్బాయిలు కలలు కంటూనే వుంటారు. కానీ ఈ అందాల భామకు నచ్చినవారే దొరకడం లేదు. ఈ అమ్మడు ఎక్కడికెళ్లినా కూడా పెళ్లి ప్రస్తావనే ఎదురవుతోంది. మీడియా, అభిమానులతోనే కాకుండా తన తోటి నటీనటుల నుంచి కూడా ఈ అమ్మడికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

అలాంటి త్రిషను పెళ్లి చేసుకోవడానికి ఛార్మింగ్ గర్ల్ ఛార్మి సిద్ధంగా వుందట. ‘త్రిష నేను నిన్ను పెళ్లి చేసుకోనా?’ అంటూ ఛార్మి బహిరంగంగానే అడిగేసింది. అయితే ఇదంతా కూడా త్రిష ఓ కార్యక్రమంలో పాల్గొనడం వల్లనే జరిగింది. త్రిష ఇటీవలే ఓ జ్యువెలరీ మాల్ కు అదిరిపోయే సింపుల్ డ్రెస్సింగ్ లుక్ వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలను త్రిష తన సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇక ఈ ఫోటోలకు అభిమానులు భారీగా కామెంట్లు, షేర్లు, ట్వీట్లతో ప్రశంసిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ ఫోటో చూసిన ‘కొమరం పులి’ హీరోయిన్ నికిషా పటేల్... ‘పింక్ లో నువ్వు సూపర్బ్’ అంటూ కామెంట్ చేయడంతో పాటు ఛార్మిని కూడా ట్యాగ్ చేసేసింది. ఇక ఛార్మి ఎందుకు సైలెంట్ గా వుంటుంది చెప్పండి! ఛార్మి కూడా ఈ తనదైన శైలిలో కామెంట్ చేసింది. ‘పెళ్లయ్యాక నువ్వు అచ్చం ఇలాగే వుంటావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా?’ అంటూ ట్వీట్ చేసింది.

ఇందుకు నికిషా స్పందిస్తూ... ‘ఎందుకు ఛార్మి? నువ్వు నన్ను పెళ్లిచేసుకోవా?’ అంటూ కామెంట్ చేసింది. ఛార్మి ట్వీట్స్ కు త్రిష కూడా స్పందిస్తూ... నువ్వు అదే అంటావని నాకు తెలుసు ఛార్మి... నా జవాబు ఎప్పుడు కూడా యస్’ అంటూ షాకిచ్చింది. వీళ్ల కామెంట్లకు వీరి అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేసారు. ఇలా పెళ్లి చేసుకోకుండా వున్న ఈ ముగ్గురు భామలే ఒకరికోసం ఒకరు కొట్టేసుకుంటూ పెళ్లి చేసుకుంటానని కామెంట్లు చేస్కోవడంతో జనాలు కాసేపు నవ్వుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Charmme kaur  Trisha  Nikhisha patel  Marriage  Tweets  Stills  

Other Articles