Comedian Shakalaka Shankar Wants To Build A Temple For Pawan Kalyan

Comedian shakalaka shankar wants to build a temple for pawan kalyan

Shakalaka Shankar Wants To Build A Temple For Pawan Kalyan, Shakalaka Shankar Build A Temple For Pawan Kalyan, Shakalaka Shankar A Temple For Pawan Kalyan, Pawan kalyan Temple, Shakalaka Shankar comedy, Shakalaka Shankar Videos

Comedian Shakalaka Shankar Wants To Build A Temple For Pawan Kalyan: Telugu cine comedian Shakalaka Shankar Wants To Build A Temple For Power star Pawan Kalyan.

ఎప్పటికైనా పవర్ స్టార్ కు గుడి కట్టేస్తాడట!

Posted: 11/03/2015 03:41 PM IST
Comedian shakalaka shankar wants to build a temple for pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎప్పటికైనా గుడికట్టేస్తానంటున్నాడు యువ కమెడియన్ షకలక శంకర్. ప్రముఖ టీవి ఛానెల్లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా భారీగా క్రేజ్ ను దక్కించుకున్నాడు కమెడియన్ షకలక శంకర్. ఈ ఒక్క కార్యక్రమంతో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ సినీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

పవన్ కళ్యాణ్ కు షకలక శంకర్ వీరాభిమాని. ‘జబర్ధస్త్’ కార్యక్రమంలో ఏకంగా పవన్ కళ్యాణ్ పై ఓ పాటను రాసి, పవన్ కళ్యాణ్ ఫోటోను పెయింటింగ్ వేసి అదరగొట్టేసాడు. ఆ స్కిట్ కు పవర్ స్టార్ అభిమానుల నుంచి భారీ ప్రశంసలు వచ్చాయి. అలాగే ఇటీవలే విడుదలైన ‘రాజు గారి గది’ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నామ జపం చేసి అదరగొట్టేసాడు.


Video Courtesy : etvteluguindia

అయితే బాగా డబ్బులు సంపాదించి, ఎప్పటికైనా తన సొంత ఊరిలో పవన్ కళ్యాణ్ కు గుడి కడతానని చెబుతున్నాడు షకలక శంకర్. మరి వరుస సినిమాలతో దూసుకుపోతున్న షకలక శంకర్ మరెన్నో సినిమాలలో నటించి, ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shakalaka Shankar  Temple  Pawan Kalyan  Videos  Stills  

Other Articles