Kalyan Ram | Interviews | Family | Sher

Kalyan ram talks about his family relations

Nandamuri Kalyan Ram talks about his family, Kalyan Ram latest interview, Kalyan Ram sher interview, Kalyan Ram sher release date, Kalyan Ram movie news, Kalyan Ram movie updates, Kalyan Ram stills, Kalyan Ram posters, Kalyan Ram trailers, Kalyan Ram

Kalyan Ram talks about his Family Relations: Nandamuri Kalyan Ram latest film Sher. This film will be release tomorrow. Kalyan Ram talks about his family in latest interview.

ఫ్యామిలీని ఏమైనా అంటే తట్టుకోలేనంటున్న షేర్

Posted: 10/29/2015 10:39 AM IST
Kalyan ram talks about his family relations

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలలో ఇరుక్కోకుండా అందరితో మంచిగా వుండే వ్యక్తులలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లే కళ్యాణ్ రామ్ ఇటీవలే జరిగిన ‘షేర్’ ఆడియో విడుదల కార్యక్రమంలో కాస్త ఎమోషనల్ గా మాట్లాడిన విషయం తెలిసిందే.

తన కుటుంబ(నందమూరి) సభ్యుల మధ్య ఎలాంటి విభేధాలు రాలేవని, అందరూ కలిసే వున్నామని, దయచేసి ఇలాంటి పుకార్లను క్రియేట్ చేయవద్దంటూ ఆ వేడుకలో కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. దీంతో కళ్యాణ్ రామ్ మాటలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడూ సైలెంట్ గా వుండే కళ్యాణ్ రామ్ ఇలా ఒక్కసారిగా కామెంట్లు చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

అయితే ఈ విషయంపై తాజాగా కళ్యాణ్ రామ్ ఓ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా తాను పక్కా ఫ్యామిలీ మ్యాన్ ను అని, అందుకే కుటుంబ అనుబంధాల మీద ప్రగాఢమైన నమ్మకం వుందని తెలిపారు. అంతే కాకుండా తన కుటుంబం అంటే చాలా ఇష్టమని, అందుకే ఎవరైనా తన కుటుంబం గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే భరించలేనని, తన కుటుంబాన్ని పాయింట్ అవుట్ చేస్తే ఎమోషనల్ అయిపోతానని కళ్యాణ్ రామ్ స్పష్టం చేసారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన ‘షేర్’ చిత్రం రేపు(అక్టోబర్30) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు ఎలాంటి విజయం అందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Interviews  Family  Sher  Release date  

Other Articles