Actor Madhavan gave clarity on Ramcharans film

Actor madhavan gave clarity on ramcharans film

Ramcharan, Ramchanran film, Madhavan, Madhvan in Ramcharans film, Ramcharans next film, Madhvan tweets

Actor Madhavan gave clarity on Ramcharans film. Actor madhvan tweeted about the Ramcharans film. He tweet that he is not acting in the film. In the next film of Ramcharan, Madhavan will be the villan, tollywood gossip gone viral.

రామ్ చరణ్ సినిమాలో విలన్ ఎవరు..?

Posted: 10/24/2015 01:26 PM IST
Actor madhavan gave clarity on ramcharans film

రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. కాగా రాంచరణ్ తర్వాత సినిమా గురించి, తర్వాత సినిమాలొ విలన్ ఎవరు అన్న దాని మీద టాలీవుడ్ లో చర్చ సాగుతోంది. తనీ ఒరువన్ సినిమా తెలుగు రీమేక్లో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్న నిర్మాతలు, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. తనీ ఒరువన్ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంది. తమిళ్లో అరవింద్ స్వామి చేసిన ఈ పాత్రను తెలుగులో ఎవరితో చేయించాలన్న చర్చ చాలా రోజులుగా నడుస్తుంది. బాహుబలిలో విలన్ గా చేసిన దగ్గుపాటి రానాను ఈ సినిమాలో విలన్ అనుకున్నా అది కుదరలేదు. కానీ ఫైనల్గా లవర్ బాయ్ మాధవన్ ఈ పాత్రకు సెలెక్ట్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి.

రాం చరణ్ సినిమాలో తాను విలన్ గా నటిస్తున్నానని వస్తున్న వార్తలను మాధవన్ ఖండించాడు. ప్రస్తుతం 'సాల ఖదూస్' సినిమాలో నటిస్తున్నఅతడు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాడు. తను ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తమని తెలిపాడు. తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన విశేషాలను వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles