Nandamuri fans in dilemma by NTR and balakrishna

Nandamuri fans in dilemma by ntr and balakrishna

Nandamuri fans, NTRs fans, Balakrishna fans, Dictator, Nannaku Prematho, Nannaku Prematho teaser, Dictator Teaser, Nannaku Prematho stills, Dictator stills

nandamuri fans in confusion by their heros NTR and Balakrishna. Balakrishnas Dictator cinema will release on January 8 on eve of sankranti. NTR film Nannaku prematho also releasing on Sankranti.

ఫ్యాన్స్ ను డైలమాలో పడేసిన బాలకృష్ణ, ఎన్టీఆర్

Posted: 10/24/2015 01:58 PM IST
Nandamuri fans in dilemma by ntr and balakrishna

నందమూరి అభిమానులు డైలమాలో ఉన్నారు. తమ అభిమాన హీరోలు ఒకే సారి ఒకే పండగకు వస్తుండటంతో ఎవరు బాక్సాఫీస్ బాద్ షాగా మారతారు అన్న సందిగ్దంలో ఉన్నారు. బాబాయ్ బాలకృష్ణతో అబ్బాయ్ ఎన్టీఆర్ సంక్రాంతి నాడు పోటీ పడునున్నారు. సంక్రాంతికి అటు డిక్టేటర్ సినిమా.. ఇటు నాన్నకు ప్రేమతో సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే విడుదలైన డిక్టేటర్ సినిమా టీజర్ అదరగొట్టింది. బాలకృష్ణ మార్క్ పంచ్ డైలాగ్ లతో నందమూరి ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇక అబ్బాయ్ ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో సినిమా టీజర్ యుట్యూబ్ లో సంచలనం రేపుతోంది. ఒక రోజులోనే మిలియన్ మంది ఈ టీజర్ ను చూడడం రికార్డ్ గా మిగిలింది. మరి అబ్బాయ్, బాబాయ్ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు..? ఎవరు కలెక్షన్ లతో రికార్డులు సృష్టిస్తారు.? చూడాలి.

డిక్టేటర్ సినిమా టీజర్ లో బాలకృష్ణ మాస్ డైలాగ్ లతో అదరగొడితే.. అదే సమయంలో చాలా హ్యాండ్సమ్ లుక్ తో కొత్త అవతారంలో కనిపించారు. నిన్న మొన్నటి వరకు ఉన్న ఇమేజ్ కాకుండా కొత్త లుక్ లో ఆడవాళ్ల హార్ట్ బీట్ పెంచుతున్నారు. ఇక అబ్బాయ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి అమ్మాయిలకు సరిగా నిద్రే పట్టడం లేదు. కొత్త లుక్ లో స్టైలిష్ గా ఎన్టీఆర్ కనిపించిన తీరు అందరిని కట్టిపడేసింది. డిక్టేటర్ సినిమాను జనవరి ఎనమిదో తేది విడుదల చెయ్యాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కూడా సంక్రాంతి బరిలో నిలవనుంది. మరి ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles