More screens added for Raju Gari Gadhi

More screens added for raju gari gadhi

Raju Gari Gadhi, Omkar, Raju Gari Gadhi News, Raju Gari Gadhi Cinema, Raju Gari Gadhi collections, Raju Gari Gadhi new screens, Raju Gari Gadhi theaters

All those who have seen the trailers of Raju Gari Gadhi were pleasantly surprised with the humorous content. Staying true to its genre, the film has opened to thumping reports all over. Both the class and mass audience are lapping up this film big time and reports reveal that the makers will enter the profit zone by this weekend. The mouth talk has been superb and this has led to a few more screens to be added in both the Telugu states.

రాజు గారి గది కోసం మరిన్ని ధియేటర్లు

Posted: 10/24/2015 12:13 PM IST
More screens added for raju gari gadhi

ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది మంచి హిట్ టాక్ సంపాదించింది. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటోంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చినా కానీ ఈ సినిమా మాత్రం ఆడియన్స్ కు బాగా రీచ్ అయింది. చాలా కాలం తర్వాత.. జీనియస్ లాంటి ప్లాప్ తర్వాత ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన రాజు గారి గది సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. ఈ దసరా కానుకగా గురువారం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్ లను రాబడుతోంది ఈ సినిమా దాంతో ఈ సినిమాను మరిన్ని ధియేటర్లలలో వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన రాజు గారి గది సినిమాకు సాయి కొర్రపాటి, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేట్ కు అమ్ముకున్న ఓంకార్.. తన చిత్రాన్ని మరిన్ని ధియేటర్లలో ప్రదర్శించాలని నిర్ణయించారు. హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన రాజు గారి గదిలో షకలక శంకర్, ధన్ రాజ్, సప్తగిరిలు కామెడీ సీన్లకు ధియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. చివరి వరకు సస్పెన్స్... మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరి చూడాలి మరిన్ని స్క్రీన్ లు మరిన్ని లాభాలను తెచ్చిపెడతాయేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles