Raviteja Bengal Tiger And Mega Hero Varun Tej Kanche Movies Clashes At Boxoffice | Tollywood Updates

Raviteja bengal tiger varun tej kanche movie clash at boxoffice

bengal tiger movie, raviteja bengal tiger, bengal tiger release date, varun tej movie, varun tej kanche movie, kanche release date, director sampath nandi news, director krish, kanche bengal tiger clash

Raviteja Bengal Tiger Varun Tej Kanche Movie Clash At Boxoffice : Raviteja Bengal Tiger And Mega Hero Varun Tej Kanche Movies Clashes At Boxoffice In Diwali Race.

రవితేజకి, మెగాహీరోకి డ్యాష్ డ్యాష్

Posted: 09/29/2015 01:33 PM IST
Raviteja bengal tiger varun tej kanche movie clash at boxoffice

మాస్ మహారాజా రవితేజ, మెగాహీరో వరుణ్ తేజ్ మధ్య క్లాష్ ఏర్పడనుంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటిదాకా సైలెంట్ గా వున్న వాతావరణం వారిరువురి క్లాష్ తో వయోలెంట్ గా మారనుందని అనుకుంటున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా.. సినిమాల విషయంలో! ఆ ఇద్దరు హీరోలు నటించిన తాజా చిత్రాలు ఒకేసారి విడుదల కానున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య నెలకొనే ఈ పోటీ చాలా ఆసక్తికరంగా వుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

రవితేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో తమన్నా, రాఖీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 7వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఇక ఈ చిత్రం పాటలను అక్టోబర్ 17వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కిక్-2’ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ మూవీ కోసం రవితేజ చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పైగా.. అతనిలాగే బలమైన కథ వుండటంతో ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. గతంలో చెర్రీతో ‘రచ్చ’ సినిమా తీసి భారీ విజయం సాధించిన డైరెక్టర్ సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ ని తెరకెక్కించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే! రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కనిపంచనున్నాడు. అప్పటి పరిస్థితులను, యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించిందేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందని ఓ సందర్భంలో క్రిష్‌ చెప్పారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబా, రాజీవ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు చింతాన్‌భట్‌ సంగీతం అందించారు. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్ గా నటించగా.. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రంలో విలన్ గా నటించిన నికేతన్ ధీర్ ఇందులోనూ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను నవంబర్ 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ వుంటుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raviteja bengal tiger  varun tej kanche  tollywood boxoffice  

Other Articles