Cute Beauty Hansika Motwani Has Given The Clarification Difference Between Puli And Bahubali Movies | Kollywood | Tollywood Updates

Hansika motwani clarification puli bahubali difference kollywood tollywood updates

hansika news, hansika motwani updates, hansika motwani controversy, Puli Movie news, vijay puli movie updates, puli movie controversy, bahubali movie, puli bahubali movies, puli movie collections, bahubali movie collections, hansika motwani beautiful photos, shruti hassan

Hansika Motwani Clarification Puli Bahubali Difference Kollywood Tollywood Updates : Cute Beauty Hansika Motwani Has Given The Clarification Difference Between Puli And Bahubali Movies.

‘పులి’కి అంత సినిమా లేదంటున్న హన్సిక

Posted: 09/29/2015 01:24 PM IST
Hansika motwani clarification puli bahubali difference kollywood tollywood updates

తమిళంలో ఇళయథలపతి విజయ్ హీరోగా రూపొందిన భారీ చిత్రం ‘పులి’. గ్రాఫికల్ విజువల్ వండర్ తో రూపొందిన ఈ చిత్రంపై గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘పులి’ సినిమాకి ‘బాహుబలి’కి చాలా దగ్గర పోలికలున్నాయని అభిప్రాయాలు వెలువడ్డాయి. ట్రైలర్లు చూస్తుంటే దాదాపు ‘పులి’ సినిమా కూడా ‘బాహుబలి’లా వుంటుందన్న వార్తలు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే.. ఆ రెండు సినిమాలకు ఎటువంటి పోలికలు లేవంటూ ఆ పుకార్లను ఖండించింది నటి హన్సిక. ‘పులి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బొద్దుగుమ్మ.. అసలు ‘పులి’కి, ‘బాహుబలి’కి ఏమాత్రం పోలికే లేదని తేల్చి చెప్పేసింది.

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్టుతో ‘పులి’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే! ఇందులో కన్నడ నటుడు సుదీప్, శ్రీదేవి విలన్లుగా నటించగా.. శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించారు. దాదాపు వందకోట్ల బడ్జెట్టుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మూవీ యూనిట్ తోపాటు హన్సిక ఈ ప్రమోషన్లో జోరుగాద పాల్గొంటోంది. ఈ సందర్భంలోనే ఆమె ముందు ఓ ప్రశ్న వచ్చి పడింది. ‘పులి’ సినిమా ‘బాహుబలి’ వుంటుందా? అని మీడియా ప్రతినిధులు ఆమెను తరచూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. తొలుత ఆ ప్రశ్న విని చిరునవ్వు నవ్వేసిన ఆ అమ్మడు.. ఆ తర్వాత తన సమాధానాన్ని తనదైన శైలిలో తెలిపింది.

‘పులి సినిమా ఫాంటసీ నేపథ్యంలో కొనసాగుతుంది. మాయలు, మంత్ర శక్తులతో ఈ సినిమా కథ సాగుతుంది. కానీ ‘బాహుబలి’ ఎత్తులు, పై ఎత్తులతో యుద్ధం ప్రధానంగా కొనసాగే కథ. కథాపరంగా ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోలిక లేదు’ అని స్పష్టం చేసింది. పైగా.. ‘పులి’లో వుండే గ్రాఫిక్స్ ‘బాహుబలి’కి పూర్తి భిన్నంగా వుంటుందని, ప్రేక్షకుల్ని అలరించే గ్రాఫిక్స్ ఎలిమెంట్స్ ఎంతో అద్భుతంగా ‘పులి’ సినిమాలో వున్నాయని చెప్పుకొచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  vijay puli movie  bahubali records  

Other Articles